Thursday, May 2, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్, జగన్ సేమ్ ప్లాన్.. అందుకే ఈ హడావిడి !

- Advertisement -

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్, ఆంధ్ర ప్రదేశ్ సి‌ఎం జగన్ ఒకే పంథాలో ఉన్నారా ? అందులో భాగంగానే ముందస్తూ ఎన్నికలకు సిద్దం అవుతున్నారా ? పైకేమో ముందస్తు ఎన్నికలకు నో అంటున్నప్పటికి.. లోలోపల వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణలో 2023 డిసెంబర్ లోనూ, అలాగే ఏపీ లో 2024 ఏప్రెల్ లోనూ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అటు తెలంగాణలోను ఇటు ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. .

అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అయినప్పటికి ముందస్తూ ఎన్నికలకు సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఏపీలో సి‌ఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చేస్తున్న కార్యక్రమాలు చేస్తుంటే ముందస్తు ఎన్నికలకు సూచన అని కొందరి అభిప్రాయం. ఎన్నికలకు ఎంతో సమయం లేదని ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని జగన్ పదే పదే పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో జిల్లా అధ్యక్షుల విషయంలోనూ, ప్రాంతీయ సమన్వయ కర్తల విషయంలోనూ కీలక మార్పులు చేశారు. అలాగే పాలన పరంగా కూడా మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ ముందస్తూ ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదని కొందరి వాదన. అయితే జగన్ కు ముందస్తూ ఎన్నికలకు వెళ్ళే అవసరం ఉందా ? అంటే ఉందనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది.

ఎందుకంటే తమ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని వైసీపీ చెబుతున్నప్పటికి.. జగన్ సర్కార్ పై వ్యతిరేకతను బలంగా ముందుకు తీసుకెళ్ళడంలో టీడీపీ, జనసేన పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీల ప్రయత్నాలు ఫలిస్తే.. జగన్ పెట్టుకున్న ” వై నాట్ 175 ” టార్గెట్ రిచ్ కావడం కష్టమని, అందుకే వచ్చే ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి స్థాయి వ్యతిరేకత పెరుగక ముందే.. ఎన్నికలకు వెళ్తే మంచిదనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కూడా ముందస్తు ఉన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు.2018లో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళిన సంగతి విధితమే. దాంతో ఈసారి కూడా ప్రతిపక్షలకు చెక్ పెట్టలంటే ముందస్తు ఎన్నికలు ఒక్కటే మార్గం అని టి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. కానీ అటు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్, ఇటు ఏపీ సి‌ఎం జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం కాబట్టి.. నేతలు ఒకటి చెప్పి మరోటి చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సేమ్ ప్లాన్ అనుసరిస్తూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు.

ఇవి కూడా చదవండి

షర్మిల అరెస్టుల మీద అరెస్టులు.. ఆమెకు లాభమేనా ?

ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -