Thursday, May 2, 2024
- Advertisement -

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జగన్ సర్కార్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. అలాగే జనసేన పార్టీ ఎజెండా ను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు పవన్. దీంతో జనసేన పార్టీ మునుపటితో పోలిస్తే ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో వేగంగా బలపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వైసీపీ కూడా టీడీపీ కన్నా జనసేననే ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ పై తరచూ విమర్శలు చేస్తూ జనసేన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం జనసేన దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది..

అయితే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది ? సింగిల్ గానే బరిలోకి దిగుతారా ? లేదా పొత్తులతో పోటీలో ఉండే అవకాశం ఉందా ? అసలు జనసేన ఎవరి ఓట్లు చీల్చబోతుంది ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో వైసీపీ, టీడీపీ పార్టీలు ఇప్పటి నుంచే సీట్ల ఖరారు విషయంలో తలమునకలు అయ్యాయి. కానీ జనసేన మాత్రం సీట్ల కేటాయింపు విషయంలో కాస్త నెమ్మదిగానే ఉంది. దీంతో పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగుతారనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. అందుకే పవన్ ఇప్పటివరకు సీట్ల కేటాయింపు విషయంలో నోరు మెదపడం లేదని తెలుస్తోంది. దీంతో పవన్ను ఇరకాటంలో పెట్టేందుకు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుందో చెప్పాలని వైసీపీ నేతలు తరచూ డిమాండ్ చేస్తున్నే ఉంటారు.

తాజాగా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తూ.. పవన్ తాను పోటీ చేసిన బిమవరం, గాజువాక నియోజిక వర్గాల నుంచి మళ్ళీ పోటీ చేయగలరా ? జనసేనాను 175 స్థానాల్లో పోటీ చేయించగలరా ? అంటూ ప్రశ్నలు సంధించారు. పవన్ రాజకీయాల్లో ఒక జోకర్ మాత్రమే అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు అంబటి. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ జోకర్ కాదు కింగ్ మేకర్ అవుతారని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి జనసేన ఓటుబ్యాంక్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో జనసేన ఎవరి ఓట్లు చీల్చబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన లాగేసుకుంటుందా ? లేదా టీడీపీకి బలం తగ్గుతున్న నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంక్ జనసేనకు ఫేవర్ కానుందా ? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. మరి వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా పవన్ ఈసారి ఎన్నికల్లో జోకర్ అవుతారా ? లేదా ఏపీ రాజకీయాలను శాసించే కింగ్ మేకర్ అవుతారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

షర్మిల అరెస్ట్.. ఆమెకు లాభమేనా ?

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!

కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం.. అదే అంటున్న బీజేపీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -