Sunday, May 5, 2024
- Advertisement -

షర్మిల అరెస్టుల మీద అరెస్టులు.. ఆమెకు లాభమే !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో గత రెండు రోజులుగా వైఎస్ షర్మిల చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలో పాదయాత్రలో భాగంగా ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా నిన్న షర్మిలను అదుపులోకి పోలీసులు. కాగా టి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆమె కారుపై దాడి చేయడంతో ఆమె మొఖానికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. అక్రమాలను ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తారా అంటూ ఆమె తాజాగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. సోమవారం చోటు చేసుకున్నా పరిణామాలలో షర్మిల కారుపై, పాదయాత్ర చేసే బస్సుపై టి‌ఆర్‌ఎస్ శ్రేణులు దాడలు చేసిన కారులో ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్తున్నా క్రమంలో పోలీసులు అడ్డగించి ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఆమె కారు దిగకపోవడంతో క్రేన్ లతో ఆ కారును పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో తీవ్ర ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంచితే తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆరాట పడుతున్న షర్మిలకు.. ఇప్పుడు జరుగుతున్నా పరిణామాల కారణంగా ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఎక్కువ. అంతే కాకుండా వైతెపా కు మంచి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. పాదయాత్రలో భాగంగా కే‌సి‌ఆర్ అవినీతి పాలనను ప్రశ్నించింనందుకు అరెస్టులు చేస్తారా ? అంటూ ఆమె ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.

తన అన్న వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందనే వాదనలు ఉన్నాయి. అయితే తెలంగాణలో పార్టీ పెట్టి దాదాపు రెండేళ్ళు అవుతున్నప్పటికి.. షర్మిల పార్టీని ప్రధాన ప్రత్యర్థి పార్టీగా అంగీకరించడంలేదు ఇతర పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఆమె చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీగానే మద్దతు లభిస్తూ వచ్చింది. ఇలాంటి తరుణంలో ఆమెపై అరెస్టులు అమలైతే.. ప్రజల్లో సానుభూతి పెరిగి పార్టీ బలం పెరుగుతుంది. దాంతో షర్మిల అరెస్ట్ ఆమెకు లాభమే అని కొందరి రాజకీయవాదుల అభిప్రాయం. ఇక ప్రస్తుతం ఆమెపై 333, 337, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.వీటిలో ఒకటి నాన్ బెయిలబుల్ సెక్షన్ గా కూడా ఉందట. మరి షర్మిల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

జగన్ తో మనకేం పని !

కే‌సి‌ఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ!

రౌడీ సేన కాదు.. విప్లవ సేన 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -