Thursday, May 2, 2024
- Advertisement -

ప్రత్యర్థులపై కే‌సి‌ఆర్ టార్గెట్.. మారుతున్న ఈక్వెషన్స్ !

- Advertisement -

తెలంగాణలో సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రత్యర్థులపై ఫోకస్ పెట్టరా ? అందుకే ప్రత్యర్థి పార్టీ నేతల పాదయాత్రలకు అడ్డంకులు సృష్టిస్తున్నారా ? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు పట్టుమని ఏడాది కాలమే ఉండడంతో ప్రస్తుతం తెలంగాణలో అన్నీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారాలలో జోరు చూపిస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. దాంతో ప్రత్యర్థి పార్టీల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రణాళికలు వేస్తునట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి అడ్డంకులు ఏర్పడడం, అలాగే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ను అరెస్ట్ చేయడం.. ఈ పరిణామాలను చూస్తుంటే కే‌సి‌ఆర్ ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసినట్లుగానే ఉందనేది కొందరి వాదన.

ప్రస్తుతం తెలంగాణలో వేగంగా బలపడుతున్న బీజేపీలో మరింత జోష్ నింపేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు దఫాలు కంప్లీట్ చేసుకున్నా ఆయన ఐదవ దఫా పాదయాత్రను బైంసా నుంచి కరీంనగర్ వరకు 20 రోజులపాటు పాద యాత్ర చేయనున్నారు. అయితే ఈసారి బండి సంజయ్ పాదయాత్రకు మొదట పోలీసుల అనుమతి లభించలేదు. దాంతో బండి సంజయ్ కోర్టు ను ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతి లభించింది. పాదయాత్రలో పాల్గొనే వారు ఎలాంటి ఆయుధాలు వాడకూడదని, బైంసా సిటీ గుండా పాదయాత్ర చేపట్టకూడదని, ఈ షరతులకు అంగీకరిస్తే పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

దీంతో షరతులతోనే బండి సంజయ్ ఐదవ దఫా పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక వైఎస్ శర్మిల పాదయాత్రలో భాగంగా నర్సింపేట నియోజికవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు చేయడం సర్వసాధారణమే అయినప్పటికి.. ఇలా అరెస్ట్ చేయడం ఏంటని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు మండి పడుతున్నారు. అయితే అటు బండి సంజయ్ విషయం లోనైనా, ఇటు వైఎస్ శర్మిల విషయంలోనైనా.. వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కే‌సి‌ఆర్ ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఆ పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు టి‌ఆర్‌ఎస్ ను గద్దె దించడం ఖాయం అని అందుకే ఇలాంటి దుస్సహసాలకు కే‌సి‌ఆర్ పాల్పడుతున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. మరి మారుతున్న ఈక్వెషన్స్ వల్ల ముందు రోజుల్లో కే‌సి‌ఆర్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

లోకేశ్ పాదయాత్ర.. వైసీపీ నేతలెందుకు అంత ఖుషీ!

రౌడీ సేన కాదు.. విప్లవ సేన : పవన్ కల్యాణ్!

ఇదేంటి చంద్రబాబు.. జగన్ను కాపీ కొట్టడమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -