Friday, May 17, 2024
- Advertisement -

బస్తీ మే సవాల్…….. బాబు అడ్డాలోనే… జగన్, చంద్రబాబుల ప్రజాబలం తేలిపోనుందా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఇద్దరు ప్రముఖనాయకులు చంద్రబాబు, వైఎస్ జగన్. ఎపి అసెంబ్లీలో ఒకరు అధికారపక్షనేత. మరొకరు ప్రతిపక్ష నేత. దేశంలోనే అత్యంత బలమైన ప్రతిపక్షనేతల లిస్టులో ప్రతిసారీ అగ్రస్థానంలోనే ఉన్నారు జగన్. ఇక పక్క రాష్ట్రం తెలంగాణా ప్రతిపక్ష నేతలతో పోల్చుకున్నా కూడా జగన్ సామర్థ్యం ఏంటో ఎవరికైనా తెలుస్తుంది. కాంగ్రెస్, బిజెపిలతో సహా ఎపిలో అధికారంలో ఉన్న చంద్రబాబు పార్టీ కూడా అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కానీ ఏ రోజు కూడా వైఎస్ జగన్ స్థాయిలో ప్రజాక్షేత్రంలో కానీ, అసెంబ్లీలో కానీ పనిచేసింది లేదు. పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ప్రత్యేకత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అదే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే చంద్రబాబు చేతకానితనం కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన పనులు ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన పనులు మాత్రం మీడియాలో అస్సలు కనిపించవు. కేవలం ఆయన మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మాటల డాంభికాలతో అన్నీ చేస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికి అస్తమానమూ పాట్లు పడుతూ ఉంటారు. దేశం మొత్తం మీద కూడా పనులు చేయడంపైన కంటే కూడా పనులు చేస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికి మాటలతో….మీడియా ప్రచారంతో తాపత్రయపడుతున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పొచ్చు.

ఆ విషయం పక్కనపెడితే చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ కూడా అగ్రశ్రేణి నాయకులే అయినప్పటికీ ……ఇద్దరూ కూడా ఒకరినొకరు గుర్తించింది లేదు. చంద్రబాబు అయితే వైఎస్ జగన్‌ని మరీ తీసిపారేస్తూ ఉంటారు. సొంత పార్టీ పెట్టిన అనతికాలంలోనే తనతో ఇంచుమించుగా సమానం ఓట్లు తెచ్చుకుని ప్రజాదరణ విషయంలో తననే ఓడగొట్టిన జగన్ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే. అయితే విశ్లేషకులు మాత్రం జగన్ అంటే ఉన్న భయం కనిపంచకుండా చేయడం కోసం జగన్‌ని పట్టించుకోనట్టుగా బాబు డ్రామాలు ఆడుతుంటాడని చెప్తూ ఉంటారు. అయితే ఇఫ్పుడు జగన్ ప్రజాదరణ ఎలా ఉంటుందో చంద్రబాబుకు మరోసారి ప్రత్యక్షంగా తెలిసే టైం వచ్చేసింది. సంక్రాంతి రోజు చంద్రబాబు నారావారిపల్లెలో ఉంటారు. అదే రోజు ఆ పల్లెకు కూతవేటు దూరంలోనే జగన్ పాదయాత్ర కొనసాగనుంది. చిత్తూరు జిల్లాలో జగన్‌కి వచ్చిన అసాధారణ ప్రజాదరణ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుకుని ఉన్నాడు చంద్రబాబు.

చంద్రబాబు సొంత జిల్లాలో జగన్‌కి ఆ స్థాయిలో ప్రజాదరణ దక్కడానికి కారణం బాబు పాలనపై ఉన్న వ్యతిరేకతనా? లేక జగన్‌పై ప్రజలకు అభిమానం పెరిగిందా? అన్నదిశగా కూడా టిడిపి వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు తన సొంత అడ్డాలోనే జగన్ ప్రజాదరణను ప్రత్యక్షంగా చూడాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. అధికార వర్గాలన్నీ కూడా బాబు సభకు అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉండేలా చేస్తాయనడంలో సందేహం లేదు. అయినప్పటికీ జగన్ స్థాయిలో బాబుకు ప్రజాదరణ దక్కుతుందా? ఎన్నికల్లో ఎలా గెలవాలి? పొత్తులు, రాజకీయ కుట్రలు, వ్యూహాలు, మీడియా మేనేజ్మెంట్ లాంటి విషయాల్లో చంద్రబాబులా జగన్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాడా అని వైకాపా వర్గాలే ఆవేధన వ్యక్తం చేస్తూ ఉంటాయి. అది జగన్ వైఫల్యమే. అయితే ప్రజాక్షేత్రంలో మాత్రం జగన్ స్థాయి ప్రజాదరణను చంద్రబాబు ఎప్పటికీ దక్కించుకోలేడని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. మరి ఈ సారైనా తన సొంత అడ్డాలో అయినా జగన్‌కంటే ఎక్కువ ప్రజాదరణ తనకు ఉందని నిరూపించుకోగలడా చంద్రబాబు? అయినా వైఎస్‌ల ప్రజాదరణ, జన నాయకులు అన్న పిలుపు రాజకీయ వ్యూహాలతో, కుట్రలతో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎప్పటికైనా దక్కుతాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -