Wednesday, May 22, 2024
- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం…… బాబుకి ఫస్ట్ షాక్ కొట్టేసింది

- Advertisement -

కోట్లాది మంది ప్రజలను ప్రేమించగలను అని మాటల్లో పదే పదే చెప్తూ ఉండే చంద్రబాబు…….40 సంవత్సరాలుగా ప్రజల కోసమే పనిచేస్తున్నాను అని ప్రతి రోజూ ప్రజలకు గుర్తుచేస్తూ ఉండే చంద్రబాబు చేసిన ఒకే ఒక్క తప్పిదం ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారబోతోందా? ఎన్టీఆర్‌పై వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా లక్ష్మీపార్వతిని బూచీగా చూపించి అటు ప్రజలను……..ఇటు నాయకులను కూడా నమ్మించగలిగాడు చంద్రబాబు. అయితే ఇప్పుడు జగన్‌పై హత్యాయత్నం తర్వాత మాత్రం బాబుకు తప్పించుకునే ఛాన్స్ లేకుండాపోతోంది. అన్నినంటికీ మించి జగన్‌పై హత్యాయత్నం తర్వాత చంద్రబాబు మాట్లాడిన లేకిమాటలు, అమానవీయ ప్రవర్తన బాబు చుట్టూ ఉన్న నాయకులకే చంద్రబాబుపై కోపం కలిగేలా చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్‌లాంటి నాయకుడు కూడా ఇప్పుడు చంద్రబాబును రాక్షసుడు అనే స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. టిడిపిలో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పుడు చంద్రబాబును గుడ్డిగా నమ్మే పరిస్థితులు లేవు అన్న మాట వాస్తవం. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలని నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి. మనుషులను వాడుకుని వదిలేసే నైజం గురించి అందరికీ తెలుసు కానీ అధికారం కోసం అవసరమైతే చంద్రబాబు ఏ స్థాయికి అయినా దిగజారగలడు అన్న విషయాన్ని మాత్రం జగన్‌పై హత్యాయత్నం ఘటన నిరూపించింది అని విశ్లేషకులు కూడా ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలన్నీ కూడా జగన్‌కి దూరమైన నాయకులను కూడా వైకాపాకు దగ్గర చేస్తున్నాయి. తాజాగా వైఎస్‌కి అత్యంత సన్నిహితుడైన గురునాథరెడ్డి జగన్‌ని పరామర్శించాడు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఈ నాయకుడు స్వయంగా వచ్చి జగన్‌ని పరామర్శించడం చంద్రబాబును షాక్‌కి గురిచేసే విషయమే. ఓ వైపు జగన్‌పై హత్యాయత్నం ఘటనను చిన్నదిగా చూపడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే స్వయంగా ఒక టిడిపి నేతనే జగన్‌ని పరామర్శించడం బాబుకు ఆగ్రహం కలిగించడం ఖాయం.

అయితే చంద్రబాబు పార్టీలోనే ఉన్న చాలా మంది నాయకులు ఇప్పుడు చంద్రబాబునే తప్పుపడుతున్నారు. అధికారం కోసం రాజకీయం చెయ్యొచ్చు కానీ మరీ మనిషిగా దిగజారే పరిస్థితులు ఉండకూడదని అంతర్గతంగా టిడిపి నాయకులే బాబు తీరును తప్పుపడుతున్నారు. గురునాథరెడ్డిలాగే మరి కొంతమంది టిడిపి నాయకులు కూడా జగన్‌ని పరామర్శించే పరిస్థితులు వచ్చినా……..లేకపోతే టిడిపి నాయకులందరూ కూడా అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగించగలడు అన్న విషయం అర్థమై చంద్రబాబు అంటే భయపడే పరిస్థితి వచ్చినా ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ప్రజలు కూడా ఈ కోణంలో ఆలోచించారంటే మాత్రం నారావారి రాజకీయానికి సమాధి కట్టేస్తారనడంలో సందేహం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -