అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఆగస్టు 15న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సెకండ్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
మే 23న 11 గంటల 7 నిమిషాలకు సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. శ్రీవల్లి సాంగ్ అని చెప్పడంతో రష్మిక మందన్న బన్నీ కోసం పాడిన పాట అని తెలుస్తుంది.
దీంతో బన్నీ అభిమానులతో పాటు రష్మిక అభిమానులు కూడా ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీసరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీ రోల్ పోషిస్తున్నారు.
