Saturday, May 18, 2024
- Advertisement -

ఎమ్మెల్యేల రాజీనామాలు….. బాబు మాస్టర్ స్కెచ్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జగన్

- Advertisement -

2014లో బాబు వ్యూహాల ముందు చతికిల పడ్డ జగన్ ఇప్పుడు మాత్రం ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇస్తున్నాడు. బాబు భజన మీడియా దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొడుతున్నాడు. అన్నింటికీ మించి జగన్, విజయసాయిల రాజకీయ వ్యూహాలు కూడా చంద్రబాబు అంచనాలకు అందడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు చంద్రబాబు అండ్ కో లో స్పష్టంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావడం కోసం తన పార్టీ ఎంపిల చేత రాజీనామాలు చేయించాడు జగన్. వైకాపా ఎంపిలు రాజీనామా చేస్తే చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరిగి టిడిపి ఎంపిల చేత కూడా రాజీనామా చేయిస్తాడు అని జగన్ భావించాడు. ఒక రాష్ట్రానికి చెందిన ఎంపిలు అందరూ రాజీనామా చేస్తే కచ్చితంగా అది జాతీయస్థాయి ఇష్యూ అయ్యేది. కేంద్రంపై ఒత్తిడి పెరిగి ఉండేది అనడంలో సందేహం లేదు. అయితే చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ ఎంపిలు కూడా పదవులకే కట్టుబడి రాజీనామాలకు ముందుకు రాలేదు.

అయితే ఇదే సందర్భంలో ఎమ్మెల్యేల రాజీనామాల విషయం కూడా ఆలోచించాడు జగన్. ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది అని సమాలోచనలు చేశాడు. అయితే వైకాపా వ్యూహాన్ని పసిగట్టిన చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండేలా మాస్టర్ స్కెచ్ వేశాడు. వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే…..ఆ వెంటనే ఆ రాజీనామాలను ఆమోదించాలని సంబంధితులకు ఆదేశాలు జారీచేశాడు. ఆ తర్వాత వైకాపా నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత స్పీకర్‌కి ఒక లేఖ ఇప్పించి అసలైన వైకాపా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలదే అని అధికార ముద్ర వేయించాలనుకున్నాడు. ఎలాగూ వైకాపా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఉంటారు కాబట్టి……….ఫిరాయింపు ఎమ్మెల్యేలదే మెజారిటీ అవుతుంది కాబట్టి……ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలదే అసలైన వైకాపా అని అధికార ముద్ర వేస్తే జగన్‌పై నైతికంగా విజయం సాధించి…..వైకాపా నాయకులు, శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతియ్యొచ్చు అనుకున్నాడు చంద్రబాబు. ఇక ఆ తర్వాత కోర్టుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నడుస్తున్న కేసులకు కూడా విలువ ఉండదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దర్జాగా ఉండొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తలనొప్పులు కూడా చంద్రబాబుకు ఉండవు.

అయితే చంద్రబాబు మాస్టర్ స్కెచ్‌ని పసిగట్టిన విజయసాయిరెడ్డిలాంటి వాళ్ళు జగన్‌కి అసలు విషయాలు చెప్పేశారని తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో సహా వైకాపా సీనియర్ నాయకులు చంద్రబాబు కుట్ర రాజకీయాన్ని జగన్‌కి వివరించడంతో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే మార్గం కాకుండా ఇప్పుడు సరికొత్తగా ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు జగన్. ఆ రకంగా చంద్రబాబు మాస్టర్ స్కెచ్‌కి తనదైన శైలిలో జగన్ కౌంటర్ ఇచ్చాడని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒక టైంలో సెల్ఫ్ గోల్స్ వేసుకున్న జగన్ ఇప్పుడు మాత్రం పూర్తి పరిణతితో వ్యవహరిస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -