Sunday, May 19, 2024
- Advertisement -

జ‌గ‌న్ రెండంచ‌ల వ్యూహం….

- Advertisement -

నంద్యాల‌లో వైసీపీ అభ్య‌ర్తి శిల్పా మోహ‌న్ రెడ్డి గెలుపే ల‌క్ష్యంతో జ‌గ‌న్ నంద్యాల‌లో విస్త్రుతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అటు టీడీపీ కూడా ప్ర‌చారాన్ని ముమ్మ‌రంచేసింది. గెలుపు నిర్ధేశించే రెండు మండ‌లాల‌పైనె జ‌గ‌న్ దృష్టి సారించి రెండంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు.

నియేజ‌క వ‌ర్గంలో 2.30 ల‌క్ష‌ల ఓట్లున్నాయి.ఇందులో మున్సి పాలిటీలో 1.2 ల‌క్ష‌ల ఓట్టు ఉండ‌గా….మిగిలిన ఓట్లు గోస్పాడు,నంద్యాల రూర‌ల్ మండ‌లాల్లో ఉన్నాయి.మున్సిపాలిటీ, నంద్యాల మండలాల్లో టిడిపి, వైసీపీలకు కాస్త అటు ఇటుగా బలముంటుంది. అంటే, పోయిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా రేపటి ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, పొయిన ఎన్నికల్లో పోలైనవి 1.75 లక్షల ఓట్లే.

ఇటువంటి పరిస్ధితిలో గోస్పాడు మండలమే చాలా కీలకంగా మారింది. ఇక్కడ ఎవరైతే ఆధిక్యత సాధిస్తారో వారిదే. అందుకే ఇటు జగన్ అయినా అటు టిడిపి అయినా గోస్పాడు మీదే బాగా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే జగన్ బుధవారం తన రోడ్డు షోను గోస్పాడు మండలంలో నిర్వహించారు. ఇదివరకు జగన్ చేయించుకున్న సర్వేలో కూడా గోస్పాడు మండలమే కీలకమని తేలిందట. అందుకే జ‌గ‌న్ ఆరెండు మండ‌లాల మీదె ప్ర‌ధానంగా దృష్టి సారించారు.

ఈ మండలానికి ప్రస్తుతం టిడిపి తరపున మంత్రి ఆదినారాయణరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, పిపి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరిలో మొదటి ఇద్దరికన్నా పిపి నాగిరెడ్డే కీలకం. ఎందుకంటే, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూడా అయిన నాగిరెడ్డిది ఈ మండలమే. పిపికి మండలంలో బాగా పట్టుంది. అందుకనే నాగిరెడ్డిని పార్టీలోకి లాక్కోవాలని టిడిపి ఎంతగానో ప్రయత్నించింది.

ఈ మండలంలోని 15 గ్రామాల్లోని 28 వేల ఓట్లలో వైసీపీ అభ్యర్థి భూమాకు 750 ఓట్ల మెజార్టీ వచ్చింది. శోభా నాగిరెడ్డి మృతి తాలూకు సానుభూతి బాగా పనిచేసింది. అయితే, తర్వాత పరిస్ధితిల్లో భూమా పార్టీ మారినా క్యాడర్ మాత్రం వైసీపీలోనే ఉంది. ప్రస్తుతానికి వస్తే మండలంలో ప్రధానమైన యాలూరు, దీబగుంట్ల, జిల్లెల, గోస్పాడు గ్రామాల ఓట్లు టిడిపికి పడకూడదన్న పట్టుదలతో నాగిరెడ్డి ఉన్నారు.

గోస్పాడు మండలంలో పరిస్ధితిని మరింత మెరుగు పరుచుకోవటంతో పాటు నంద్యాల రూరల్, పట్టణంలో కూడా మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ రెండు వారాల క్యాంపు పెట్టుకున్నారు. మరి, చంద్రబాబునాయుడు ఏం ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -