Saturday, May 18, 2024
- Advertisement -

ముల్లును ముల్లుతోనే తీయాల‌నే స్ట్రాట‌జీనీ ఉప‌యోగిస్తున్న జ‌గ‌న్‌..

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఏపీ రాజ‌కీయాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తుల‌తో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ప్ర‌ధానంగా వ‌ల‌స‌ల‌పై దృష్టి పెట్టారు. ఆయా పార్టీల‌పై అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ త‌మ పార్టీలోకి లాగేసేందుకు పావులు క‌దుపుతున్నారు.

ఇక అధికార టీడీపీ, వైసీపీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాబును కోలుకోలేకుండా చేసేందుకు జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వ్యూహాల ఫ‌లితం క‌న‌బ‌డుతోంది. జ‌గ‌న్ వేస్తున్న ఎత్తుల‌కు బాబు కుదేల‌వుతున్నారు. టీడీపీకి బాగా ప‌ట్టున్న జిల్లాల‌పై జ‌గ‌న్ పైచేయి సాధిస్తున్నారు.

చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టే ఉద్యేశ్యంతో వైసీపీలోని ఎంఎల్ఏలు, ఎంపిల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పావులు క‌దుపుతున్నారు.ఇప్ప‌టికే చ‌లామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే. ముల్లును ముల్లుతోనే తీయాల‌నే సామెత‌ను ఉప‌యోగించి చంద్ర‌బాబును దెబ్బ కొట్టేందుకు అదే ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళుతున్నారు జ‌గన్ .

కాక‌పోతే నియోజ‌క‌వ‌ర్గాల్లోని ద్వితీయ‌శ్రేణి నేత‌ల‌పై గురిపెట్టారు జ‌గ‌న్‌. రేప‌టి ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా టిక్కెట్టు వ‌చ్చే అవ‌కాశాలు లేని నేత‌ల‌ను, చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌ల వివ‌రాలు సేక‌రించి మ‌రీ అటువంటి వారిని జ‌గ‌న్ ల‌క్ష్యంగా చేసుకుని పావులు క‌దుపుతున్నారు. ఏపార్టీకైనా ద్వితీయశ్రేణి నేత‌ల వ‌ల్లే ఉపయోగాలు ఎక్కువుగా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వ్యూహాలు పన్నుతున్నారు. జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వ్యూహాలు ఫ‌లిస్తున్నాయి.

కృష్ణ ప్రసాద్ , వసంత కృష్ణ ప్ర‌సాద్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి కందువా క‌ప్పుకున్నారు. రాజ‌ధాని జిల్లాలైన కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవాలంటే క‌చ్చితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నేత‌ల మ‌ద్ద‌తు లేకుండా సాధ్యం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిం.

జ‌గ‌న్ గ్ర‌హించ‌టంతోనే క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌ల‌ను ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే వ్యూహాలు పన్నుతున్నారు. మ‌రి రేపటి ఎన్నిక‌ల్లో ఎవ‌రి వ్యూహం వ‌ర్క‌వుట‌వుతుందో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -