Monday, May 20, 2024
- Advertisement -

గ‌వ‌ర్న‌ర్‌తో చంద్ర‌బాబు భేటీ వెనుకున్న మ‌త‌ల‌బు ఏంటి…? వైసీపీ ఎంపీ బొత్స‌

- Advertisement -

వైసీపీ సీనియ‌ర్‌నేత బొత్స‌స‌త్య‌నారాయ‌ణ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసిన బొత్స హ‌టాత్తుగా గ‌వ‌ర్న్‌తో భేటీ కావాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. దాని వెనుక ఉన్న మ‌త‌ల‌బుఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికోసం ఆలోచించ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రో కొత్త నాట‌కానికి తెర‌లేపారాని విమ‌ర్శించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై కేంద్రం చర్యలు తీసుకోనుందన్న సమాచారంతోనే బాబు గవర్నర్ తో భేటీ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత సీఎంపై చర్యలు లేకుంటే లాలూచీ పడినట్లేనని తెలిపారు.

బిజెపి, టిడిపి లు కలిసి ఏప్రిల్ 30 తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తప్పారని గుర్తు చేశారు. అందుకు నిరసనగా ఈ నెల 30ని ”వంచన దినం” గా పాటించనున్నట్లు, ప్రజలు కూడా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే ఈ పాటికి కేంద్రం దిగొచ్చేదన్నారు. ఒక్కసారి ఓట్లేసిన పాపానికే బలహీన వర్గాలకు అణగదొక్కుతారా? అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన బొత్స డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -