Friday, May 17, 2024
- Advertisement -

ప‌దోత‌ర‌గ‌తి చదివిన అమ్మాయి.. నెలకు 2 ల‌క్ష‌లు సంపాదిస్తుంది

- Advertisement -
10th class Studied Women Earning 2 Lakhs per Month

ఆకలితో ఉన్న కడుపు.. జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని ఆమె ఇప్పుడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తోంది అంటే నమ్మగలరా.. కానీ నిజం. ఇంతకు ఎవరు తను? ఎలా సంపాదిస్తోంది..? ఆమె పేరు నందిని బెంగుళూరు స‌మీపంలో గ‌ల చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది. డాక్ట‌ర్ కావ‌ల‌న్న క‌ల పేద‌రికం వ‌ల్ల చెదిరిపోయింది. నందిన వాళ్ళ నాన్న ఆ గ్రామంలోగ‌ల చిన్న గుడిలో పూజారి. కుటుంబం గడ‌వ‌ట‌మే క‌ష్ట‌మ‌నిపిస్తుండ‌టంతో ప‌దోత‌ర‌గ‌తి చ‌దివిన నందినికి చ‌దువు ఆపి పెళ్లి చేశారు.

భ‌ర్త కూడా ఓ గుడిలో అర్చ‌కుడే. రెండు పూట‌లు తిండి దొరికితే చాలు అనుకునే ప‌రిస్థితి. త‌న వంతు సాయంగా చిన్న చిన్న ప‌నులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది నందిని. ఈ స‌మ‌యంలో తండ్రి మ‌ర‌ణం.. త‌న చిట్టి చెల్లి భాధ్య‌త కూడా త‌న‌పైనే ప‌డింది. త‌న చ‌దువు, పెళ్లి ఇలా భారాలు ఎక్కువ కావ‌టంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పిన స‌ల‌హా త‌న జీవితాన్నే మార్చేసింది. ఉబ‌ర్.. ఆన్ లైన్ క్యాబ్ బుకింగ్ స‌ర్విస్‌.

ఈ కంపెనీకి ఓ డ్రైవ‌ర్‌ని మ‌నం అందిస్తే, ఆ డ్రైవ‌ర్ ఆ కంపేని ద్వారా న‌డిపే ట్రిప్పుల ఆదారంగా మ‌న‌కు 3000లు వ‌స్తాయ్ అనే విష‌యం తెలుసుకుంది. మ‌న‌కే సొంత కారు ఉంటే, ఉబ‌ర్‌లో పార్టైమ్ డ్రైవింగ్ కూడా చేసుకోవ‌చ్చు.. అంతే డ్రైవింగ్ జాబ్ కావ‌లా అనే పేప‌ర్లు సిటీ మొత్తం అంటించింది. ఒక‌రిని, మ‌రొక‌రిని, అలా ఇప్ప‌టి వ‌ర‌కూ 600 మంది డ్రైవ‌ర్ల‌ను ఉబ‌ర్ కంపెనీకి జ‌త చేసింది. ఓ చిన్న ఆఫీస్‌, న‌మ్మ‌క‌స్తులైన న‌లుగురు స్టాఫ్‌.. నెల‌కు రెండు ల‌క్ష‌ల ఆదాయం. అంతే నందిని జీవితం ఒక్క సంవ‌త్స‌రంలో మారిపోయింది. బెంగుళూరులో సొంత ఇల్లు, ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో త‌న పాప చ‌దువు. నందిని జీవితానికి ఉబ‌ర్.. వెలుగునిచ్చింది. 

{youtube}e_pwWX1bdZE{/youtube}

Related

  1. వామ్మో !.. సమంత లాగానే ఇంకో అమ్మాయి
  2. ఆ అమ్మాయి ప్రేమలో బాలకృష్ణ వారసుడు…?
  3. దంగల్ లో అమీర్ పెద్ద కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాకే!
  4. ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -