జియో సంచలన ఆఫర్స్‌తో మిగిలిన టెలికం కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. జియో షాక్ కి రెండు నెలలుగా విలవిల్లాడుతోన్న ఇతర కంపెనీలు ఇప్పుడిప్పుడే నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా 28 కోట్ల యూజర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నఎయిర్‌టెల్ జియోకు పోటీగా రెండు అన్‌లిమిటెడ్ ఆఫర్లను తీసుకొచ్చింది.
జియె దెబ్బకు మార్కెట్లో నిలబడాలంటే అన్‌లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించక తప్పదని ఎయిర్‌టెల్ కొంత ఆలస్యంగానైనా తెలుసుకుంది. దీంతో గురువారం రెండు కొత్త ప్రీపెయిడ్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్‌లో 345 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటే 28 రోజుల వరకూ ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ రీచార్జ్‌లో 1జీబీ 4జీ డేటా ఉచితంగా ఇచ్చింది. మరో ఆఫర్‌లో 145 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చని, 300 ఎంబీ 4జీ డేటా లభిస్తుంది.
Related