Tuesday, May 21, 2024
- Advertisement -

హెరిటేజ్ అభివృద్ధి అనూహ్యం……. అమరావతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

- Advertisement -

నోట్ల రద్దుకు ముందుగానే హెరిటేజ్ భారీ వ్యాపార నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే……అబ్బే ……నోట్ల రద్దుతో ఏం సంబంధం అని అమాయకంగా చెప్తారు. ఇక 2016-17 సంవత్సరానికి హెరిటేజ్ సంస్థ 2700 కోట్ల లాభాలు ఆర్జించింది. ఒక సంవత్సరంలో 2700 కోట్ల ఆదాయం నారావారి కుటుంబ సంస్థ సాధించింది. చంద్రబాబునాయుడి కోడలు బ్రాహ్మిణి తాజాగా ఈ లెక్కలు చెప్పుకొచ్చింది. మరో వైపు చంద్రబాబేమో నేను కడు పేదవాడిని…….చేతికి వాచీ కూడా లేదు అని చెప్పుకుంటూ ఉంటాడు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో హెరిటేజ్‌కి ప్రాధాన్యం దక్కడం గురించి ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. హెరిటేజ్‌కి లబ్ది చేకూరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ బాబు మాత్రం నిప్పు అని ప్రజలు నమ్మాలి. ఇక హెరిటేజ్‌ని లాభాల బాట పట్టించడంలో…….అనూహ్య అభివృద్ధి సాధించడంలో తన సమర్థతను నిరూపించుకుంటున్న చంద్రబాబు అమరావతి అభివృద్ధిని మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ప్రపంచం మొత్తం తిరిగి పరిశ్రమలు తెస్తున్నాం……….రాజధానికి భూములు ఇచ్చి దిగులుపడుతున్న రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అప్పులు ఇవ్వండి అని చెప్తున్న చంద్రబాబు…….తన సొంత కుటుంబ సంస్థ హెరిటేజ్ మాత్రం ఇంకా ట్యాక్స్‌లు అన్నీ తెలంగాణా రాష్ట్రంలోనే పే చేస్తుంటే ఏమీ మాట్లాడడు. అలాగే వంద కోట్ల పెట్టుబడులు పెట్టే సంస్థల ప్రారంభోత్సవాలకు కూడా వెళ్ళి కంపెనీలు తెచ్చేస్తున్నా……ప్రపంచ గమ్యస్థానం ఎపినే అని చెప్పే ఉపన్యాసాలు దంచే చంద్రబాబు తన సొంత కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ని మాత్రం ఇప్పటికీ కూడా అమరావతికి తరలించడంలో ఫెయిల్ అవుతున్నాడు. సంవత్సరానికి 2700 కోట్లు లాభాలు సంపాదిస్తున్న హెరిటేజ్ సంస్థ హైదరాబాద్‌లో ఉంటేనే అభివృద్ధికి అవకాశాలుంటాయని చంద్రబాబు నమ్ముతున్నట్టా? లేక తను కలలు కంటున్న అమరావతిపైన చంద్రబాబుకే నమ్మకాలు లేవా?

ఏది ఏమైనా కేవలం ఏడాది వ్యవధిలో నారా వారి సంస్థ 2700 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇకనైనా చంద్రబాబు……….నేను చాలా పే………ద వాడిని…………..నా కుటుంబం పే……….ద……..కుటుంబం అన్న డైలాగులు వినిపించకుండా ఉంటాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -