Friday, May 17, 2024
- Advertisement -

బిత్తిరి సత్తి నిజంగానే బిత్తరపోయాడట

- Advertisement -

నిజమే మీరు చదువుతున్నది. నిజంగానే బిత్తిరి సత్తి బిత్తరపోయాడు. ఎందుకు? ఎప్పుడు? ఎలా అంటారా? అయితే తెలుసుకోండి. ఓ ఛానెల్ లో తన పేరిటే అంటే “బిత్తిరి సత్తి’ టైటిల్ తో వచ్చే తీన్‍మార్ ప్రోగ్రాంలో తనదైన స్టైల్ లో కడుపుబ్బ నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. అయితే, అందరినీ నవ్వించేందుకు పడే పాట్లే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టాయి.

ఈ మధ్యే అమెరికా తెలుగు సంఘం -ATA వేడుకలో పాల్గొనేందుకు సత్తికి ఆహ్వానం పంపించారు. ఇంకేముంది. మన సత్తి ఆ ఆహ్వానం తీసుకుని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కు వెళ్లాడు. అక్కడ ఇంటర్వ్యూలో సత్తికి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి అధికారులు మీరేం చేస్తారని అడిగితే మన సత్తిగాడు తను ఆర్టిస్ట్ అని చెప్పాడట. అంతే కాదు… యూట్యూబ్ ఓపెన్ చేసి మరీ చూపించాడట. పిచ్చి పిచ్చి చేష్టలతో, తెలిసీ తెలియని అమాయకత్వంతో కడుపుబ్బ నవ్వించే కొన్ని క్లిప్పులు చూపించాడట.

అవన్నీ పరిశీలించారు అమెరికా అధికారులు “ఆర్ యూ మ్యాడ్? (మీకేమైనా పిచ్చా?) అని ప్రశ్నించారట. అందుకు తత్తరపడ్డ మన బిత్తిరి సత్తి నోనో అన్నాడట. అది తన ప్రోగ్రామ్ అని, అందులో తన పాత్ర అలాగే ఉంటుందని వివరించాడట. సత్తిగాని సమాధానాలు సంతృప్తి పరచలేదు. దీంతో నీలాంటి వ్యక్తి అమెరికాకు వెళ్తే మా వాళ్లకు ప్రమాదం అంటూ వీసా రిజెక్ట్ చేశారట. అదండీ విషయం.  అందుకే పాపం! బిత్తిరి సత్తి. అయితే ఇదే తొలిసారి కాదట. గతంలోనూ అమెరికా కాన్సులేట్ లో ఈయనగారి వీసా తిరస్కరించారట. 

Trending

  1. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  2. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. హీరోయిన్ – డైరెక్టర్ భార్య కొట్టుకున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -