Saturday, May 4, 2024
- Advertisement -

500, 1000 రూపాయల నోట్ల రద్దుపై.. బిచ్చగాడు చెప్పిన మాట నిజమైంది

- Advertisement -
bichagadu movie idea you should give 500 1000 rupee notes away

నల్లధనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ అర్థరాత్రి నుంచి 500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. డిసెంబరు 30లోగా 500, 1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించవచ్చని ప్రధాని వెల్లడించారు. మంగళవారం రాత్రి దిల్లీ నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.

‘సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌’ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు..నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం’’ అని వివరించారు. అయితే రిసెంట్ గా రిలీజ్ అయిన ‘బిచ్చగాడు’ చిత్రంలో ఓ సీన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో…  ‘అవినీతి నిర్మూలన’ గురించి ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌లో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఓ బిచ్చగాడు ఫోన్‌ కాల్ చేసి అవినీతిని నిర్మూలించాలంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచిస్తాడు. తన వాదనను ఉదాహరణలతో సహా వివరిస్తాడు. ఎప్పట్నుంచో ఈ విషయంపై డిమాండ్‌ వినిపిస్తున్నప్పటికీ… ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకొని అందరినీ షాకింగ్‌కు గురిచేసారు మోడీ. ప్రధానంగా సోషల్‌ మీడియాలో ఇదే పెద్ద చర్చ. ఈ నెపథ్యంలో ‘బిచ్చగాడు’  సినిమాలోని ఈ సీన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

{youtube}tQ3k6Ut1nHg{/youtube}

Related

  1. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు..!
  2. షూటింగ్ లకు షాక్ ఇచ్చిన మోడీ!
  3. ప్రజలు ఏం చెయ్యాలని మోదీ కోరుకుంటున్నారు?
  4. ప్రజలకు, బ్యాంకులకు రానున్న వారం రోజులు చుక్కలే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -