Wednesday, May 15, 2024
- Advertisement -

మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు..!

- Advertisement -
Chandra babu opposing modi’s decision..

అమరావతి: మంగళవారం రాత్రి దేశ ప్రజలకు షాకిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అర్ధ రాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని చెప్పారు. అందుకు ప్రజలు వాటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకుని కొత్తవి పొందాలని సూచించారు. కొత్త నోట్లలో 500, 2000 రూపాయిలు ఉంటాయి కానీ 1000 కరెన్సీ ఉండదు.

అయితే ఈ నిర్ణయపై ఏపీ సీఎం చంద్రబాబు మొదట అభినందనలు తెలిపినప్పటికీ తర్వాత వ్యతిరేకించారు. ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.  

ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని, ఇలా పెద్ద నోట్లను రద్దు చేయాలని టీడీపీ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే భారత ఆర్ధిక వ్యవస్థ ముఖ చిత్రం ఈ నిర్ణయంతో పూర్తిగా మారిపోనుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాల్సిందిగా గత నెల్లో చంద్రబాబు మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక అన్ని లావాదేవీలు బ్యాంక్ ద్వారానే జరిగేలా పరిస్థితి మారనుందని, తద్వారా నల్లధనం తగ్గుతుందని చెప్పారు చంద్రబాబు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -