Wednesday, May 22, 2024
- Advertisement -

ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఆత్మ‌హ‌త్య చేసుకున్న పాము..

- Advertisement -

సాధారణంగా మనుషులే ఆత్మహత్య చేసుకుంటారని మనం ఇప్ప‌టి వ‌ర‌కు అనుకుంటాం. మ‌నుషుల‌కే కాదు జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయట. దీనికి సంబంధించిన విష‌యం ఇటీవ‌లే వెలుగులోకి వ‌చ్చింది. పాము ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఏంట‌ని ..ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? మీరు విన్న‌ది నిజ‌మే.

ఆస్ట్రేలియాలో ఒక భయంకరమైన పాము ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. అత్యంత విషపూరితమైన ట్రీ బ్రౌన్ అనే ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం నిపుణులను సైతం ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కేథరిన్ నివాసి మెంట్‌హెగెన్ సమక్షంలో జరిగింది. మెంట్ పాములు పట్టడంలో నిపుణుడు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను మెంట్ ఒక వెబ్‌సైట్‌లో వివరించారు.

తనకు ఇటీవల ఒక మహిళ ఇంటి నుంచి ఫోను వచ్చిందని, అక్కడ 1.5 మీటర్ల పొడవైన పాము ఉందని ఆమె తెలిపిందన్నాడు. తాను తన వాహనంలో పామును పట్టుకునేందుకు వెళ్లానన్నాడు, అక్కడకు వెళ్లగానే తనకు ట్రీ బ్రౌన్ పాము కనిపించిందని తెలిపాడు. కాగా రెండు గంటల నుంచి ఆ పాము అక్కడే పడివుందని ఆ మహిళ మెంట్‌కు తెలిపింది. ఈ నేపధ్యంలోనే మెంట్ ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ పామును పట్టుకున్న వెంటనే అది దాని మెడపై అదే కాటువేసుకుని ఆత్మ హత్య చేసుకుని చనిపోయిందని తెలిపాడు.

ఇవి కాటు వేస్తే ఎలాంటి మనిషి అయినా నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పాలలో ఈ జాతి ఒకటి. సాధారణంగా పాములు తమంత తాముగా ఆత్మహత్య చేసుకోవడం తానెన్నడూ చూడలేదని ఆయన తెలిపాడు. ఈ పాము తన సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడడం షాకింగ్ గా ఉందని ఆయన తెలిపారు. త‌మ‌కు ఇష్టంలేని ప‌నులు చేస్తె మ‌నుషులే కాదు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం జంతువులు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకంటాయ‌ని ఈ సంఘ‌ట‌నె ఉదాహ‌ర‌ణ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -