Saturday, May 18, 2024
- Advertisement -

‘లక్ష్మీస్ వీరగ్రంథం’…..ఎన్టీఆర్ పరువు గంగలో కలిపేస్తారా? బాబు వ్యూహమేంటి?

- Advertisement -

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని, పార్టీని లాక్కున్నవెంటనే ప్రజల దృష్టిలో ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూపించడానికి చాలా ప్రయత్నాలే చేశాడు చంద్రబాబు. ‘ఎన్టీఆర్‌కి విలువలు లేవు’ అని ఇండియాటుడే ఇంటర్యూలో మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్‌కి తన ఆవేధనను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్ గుర్తులేవీ పార్టీ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ బ్రతికున్నంత వరకూ కూడా తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్‌ని తక్కువగా చూడాలని, ఎన్టీఆర్‌ని మర్చిపోవాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళు కాస్తా ఎన్టీఆర్ చనిపోయిన వెంటనే ఓట్ల కోసం ఆయన ఇమేజ్‌ని వాడుకోవడానికి మాత్రం వెనుకాడలేదు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలన్నీ అలానే ఉంటాయి.

ఆ విషయం పక్కన పెడితే పరిటాల ఫ్యాక్షనిజం, వంగవీటి రంగా జీవితాల్లో ఎమోషనల్ డ్రామాని చూసిన రామ్ గోపాల్ వర్మ వాళ్ళిద్దరిపై తీసిన సినిమాలతో బాగానే క్యాష్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా వర్మ నుంచి వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయినవి ఇలాంటి సినిమాలే. వీరప్పన్ జీవిత కథ కూడా వర్మకు బాగానే కలిసొచ్చింది. అందుకే ఆ మూడు సినిమాల కంటే కూడా ఇంకాస్త ఎక్కువ డ్రామా ఉన్న, ఎక్కువ పాపులారిటీ ఉన్న ఎన్టీఆర్ జీవితకథను ఇప్పుడు సినిమాగా తీయబోతున్నాడు. అది కూడా ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఘట్టాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు వర్మ. అప్పట్లో చంద్రబాబు భజన మీడియా దాచిన నిజాలను జనాల కళ్ళకు చూపిస్తానంటున్నాడు వర్మ. ఈ సినిమా వైకాపాకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి వైకాపా నాయకుడు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. వర్మ తీయబోయే సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజం ఉంటుంది. లక్ష్మీపార్వతిని కూడా మరీ ఎక్కువ నెగిటివ్‌గా చూపించకపోవచ్చు. చంద్రబాబును మాత్రం పూర్తిగా నెగిటివ్‌గా… ఉన్నదున్నట్టుగా చూపించే అవకాశాలు ఉన్నాయన్నది వర్మ సన్నిహితుల అభిప్రాయం.

ఇక్కడే చంద్రబాబు టీంకి కోపం వస్తోంది. అందుకే చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ కూడా వర్మ తీయబోయే సినిమాను, వర్మను తీవ్రస్థాయిలో విమర్శించారు. దాంతో పాటు తెరవెనుక మరో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఆవేధన రగిలిస్తోంది. వర్మ సినిమా కంటే లక్ష్మీస్ వీరగ్రంథం అన్న సినిమా వచ్చేలా చేస్తున్నారు టిడిపి జనాలు. లక్ష్మీ పార్వతిని బూచీగా చూపించి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారన్నది నిజం. అందుకే అదే లక్ష్మీపార్వతిని ఇప్పుడు మరోసారి చాలా దిగువ స్థాయి మహిళగా చూపించడం కోసం కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చేత ఓ సినిమా తీయిస్తున్నారు. ఇక ఆ సినిమా అంతా కూడా లక్ష్మీ పార్వతిని ఏ స్థాయిలో అథమంగా చూపిస్తారో వీరగ్రంథం అన్న టైటిల్‌తోనే చెప్పేశారు. మరి అలాంటి స్త్రీని పెళ్ళి చేసుకున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అది కూడా ఎన్టీఆర్ బ్రతికున్నంత కాలం లక్ష్మీ పార్వతి పెద్దగా మాట్లాడింది లేదు. ఎన్టీఆర్ బహిరంగ సభలో లక్ష్మీపార్వతితో పెళ్ళి వ్యవహారం గురించి మాట్లాడాడు. పెళ్ళి చేసుకున్నాడు. అంతే కాకుండా లక్ష్మీ పార్వతి గురించి ఎన్నో సార్లు ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు టిడిపి జనాలు లక్ష్మీ పార్వతిని అథమ స్థాయి స్త్రీగా చూపించే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ ఏ స్థాయి వ్యక్తి అవుతాడు. ఈ మొత్తం సినిమా ఎపిసోడ్ అంతా కూడా ఎన్టీఆర్ వ్యక్తిత్వ స్థాయిని తగ్గించదా? కచ్చితంగా ఎన్టీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది. అయితే చంద్రబాబు అండ్ కోకు మాత్రం అది పెద్ద విషయం కాదు. ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయినా ఫర్వాలేదు.

చంద్రబాబుకు రాజకీయంగా కలిసొస్తే చాలు. ఇక ఈ సినిమా వెనకాల టిడిపి వాళ్ళు ఉన్నారు అని ఎలా చెప్తారు అని కొంతమంది టిడిపి భజన బ్యాచ్ అమాయకంగా అడుగుతున్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా లక్ష్మీపార్వతి ఆవేధన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉండడం…..ఎన్టీఆర్ పరువు తియ్యొద్దని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉండడం…….ఇక ఎల్లో మీడియా మొత్తం కూడా ….మరీ ముఖ్యంగా తోకపత్రిక అయిన బూతు మీడియా అంతా కూడా ఈ లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు, ఆ సినిమా డైరెక్టర్‌కి ఇస్తున్న పబ్లిసిటీ ఒక్కటి చాలు …..లక్ష్మీస్ వీరగ్రంథం వెనకాల ఎవరున్నారో చెప్పడానికి. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా తీయకుండా తనను సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు, లక్ష్మీ పార్వతి మనుషులు బెదిరిస్తున్నారని లక్ష్మీస్ వీరగ్రంధం డైరెక్టర్ చెప్తున్న కామెడీ మాటలను ఎల్లో మీడియా ఓ స్థాయిలో హైలైట్ చేస్తోంది. మరోసారి లక్ష్మీ పార్వాతిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి అటూ ఇటూగా పదివేలు అద్దె ఉండే ఒక అద్దె ఇంట్లో ఉంటోంది……చుట్టూ మనుషులూ లేరు, డబ్బులు కూడా లేవు. అలాంటి లక్ష్మీపార్వతి చెప్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను అడ్డుకుంటున్నారా? అయినా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దలు చంద్రబాబు భజన పరులు అన్న విషయం ఎవరికి తెలియదు? బాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించే సినిమాను వాళ్ళు అడ్డుకుంటున్నారంటే నమ్మాలా? వెన్నుపోటు సమయంలో ఎల్లో మీడియా తప్ప మరో మీడియా లేదు కాబట్టి డ్రామాలు రక్తికట్టి చంద్రబాబు హీరో అయ్యాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఒక్కటి చాలు…..అసలు నిజాలన్నీ బయట పెట్టడానికి. అలాంటిది ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలే ఆడతాం అంటే ఎలా? కాస్త నమ్మేలాగే ఏదైనా ట్రై చేస్తే బెటర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -