Friday, May 17, 2024
- Advertisement -

వెంకయ్యనాయుడు అడుక్కోవద్దంటుంటే…. చంద్రనాయుడేమో అడుక్కోమంటాడేంటబ్బా?

- Advertisement -

వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడి దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. బాబును బలవంతుడిని చేయడం కోసం ప్రజాబలం లేకపోయినప్పటికీ అధ్యక్ష పదవితో సహా ఎన్నోపదవులను కట్టబెట్టిన బిజెపికే తెలుగునాట అస్తిత్వం లేకుండా చేసిన ఘనుడు వెంకయ్య అని మీడియా జనాలు, రాజకీయ మేధావులు ఎప్పుడో తేల్చిచెప్పేశారు. ‘నాయుడంటేనే నాయకుడు’ అని చెప్పి ఆ మధ్య సగర్వంగా చెప్పిన వెంకయ్యనాయుడు…..చంద్రబాబునాయుడి పార్టీ బలంగా కోరుకోవడం వెనుక అసలు ఇష్టం ఏంటో కూడా డైరెక్ట్‌గానే తేల్చిచెప్పేశాడు. ఇప్పుడు ఆ వెంకయ్యనాయుడు ఎంపిలు అడుక్కోవద్దని పదే పదే చెప్తున్నాడు. బెగ్గింగ్ వద్దని గట్టిగా చెప్తున్నాడు. ఈ విషయంలో వెంకయ్యనాయుడి ఆలోచన భేష్ అని విశ్లేషకులు చెప్తున్నారు.

కానీ మరోవైపు ఆయన ఆత్మబంధువు చంద్రబాబు మాత్రం అడుక్కోవడం మాత్రమే సరైన విధానం అని చెప్తూ వెంకయ్య ఐడియాలజీతో విభేదించడమే ఆశ్ఛర్యం కలిగిస్తోంది. తెలుగు వాడి ఆత్మగౌరవం అని చెప్పి గర్జించి అధికారంలోకి వచ్చిన హీరోచిత నాయకుడు ఎన్టీఆర్. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఎన్టీఆర్ హీరోయిజాన్ని గుర్తు చేశాడు, కాంగ్రస్ బానిసల్లా చూసిందన్నాడు, నాది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చరిత్ర, చక్రం తిప్పా, ఇరగదీస్తా అధికారం ఇవ్వండి అని అడిగాడు. మోడీ మేనియా, బాబు భజన మీడియా ప్రచారం, నట నాయకుడు పవన్ కళ్యాణ్ భజనతో పాటు వందల కొద్దీ అబద్ధపు హామీల పుణ్యమాని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. ఏదైనా చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నంతలోనే ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇక ఆ తర్వాత నుంచీ మోడీతో పాటు కెసీఆర్ దగ్గర కూడా బాబు ఫాలో అవుతున్న విధానం అడుక్కోవడానికి ఏ మాత్రం తక్కువ కాదన్నది నిజం. కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాల్లో మోడీని ఇబ్బందిపెట్టే అవకాశం ఉన్న ఆంద్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను మోడీ మెప్పు కోసం తానే తాకట్టు పెట్టేసి ఆరు కోట్ల సీమాంధ్రులకు తీరని ద్రోహం చేశాడు. ప్యాకేజ్‌కి అతీ గతి లేదు. రైల్వే జోన్‌తో సహా అన్ని విషయాల్లోనూ అన్యాయమే. విభజన నిర్ణయం రాకముందే సీమాంద్ర రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వాలన్న బాబు కనీసం చట్టప్రకారం రావాల్సిన రాజధాని నిధులు కూడా ఒక్క రూపాయి కూడా రానప్పటికీ కనీస మాత్రంగా కూడా అడగడు. తెలుగుదేశం ఎంపిలు, మంత్రులు అడుక్కునే పద్ధతి కూడా మోడీని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేంత బేలతనం బాబుది. ఒకవైపు వెంకయ్యనేమో అడుక్కోవడం తప్పు అన్నట్టుగా గట్టిగా చెప్తూ ఉంటే…… ఆయన ఆప్త మిత్రుడు మాత్రం అంతకంటే తక్కువ స్థితిలో ఉండడం మాత్రం బాధాకరం. కాకపోతే ముఖ్యమంత్రిపదవి, అధికారం, కొడుక్కీ రెండు మంత్రి పదవులు, కేంద్రంలో కూడా టిడిపి ఎంపిలకు మంత్రి పదవులతో అందరూ బాగానే ఉన్నారు కానీ బాబు బేలతనం పుణ్యమా అని విభజన నాటి నష్టం కంటే ఈ మూడున్నరేళ్ళలో జరిగిన నష్టం ఇంకా ఎక్కువన్నది నిఖార్సైన నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -