Friday, May 17, 2024
- Advertisement -

ఫ్యామిలీ ప్లానింగ్ లేక‌పోతే… రోడ్డున ప‌డ‌తారు…!

- Advertisement -

టైటిల్ చూసి స్టోరీ చ‌ద‌వ‌క‌పోతే మీరు జీవితంలో ఇదెందుకు మిస్స‌య్యామా అని బాధ‌ప‌డ‌తారు. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇక్క‌డ పిల్ల‌లు క‌ల‌గ‌కుండా చేసే ఆపరేష‌న్ కాదు. జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకునే చ‌క్క‌టి ప్లానింగ్. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పూర్తిస్థాయిలో ..అంటే నిండు నూరేళ్లు ఆనందంగా బ‌త‌క‌డం..మ‌నం పోయినా మ‌న పిల్లలు మ‌న పేరు చెప్పుకునేవిధంగా బ‌త‌కాలి.. దీనికి చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే. పేద‌రికంలో ఉన్న‌వాడికి ఆ పూట గ‌డిస్తే చాలు.. రేప‌టి బెంగ ఉండ‌దు,మ‌ధ్య‌తర‌గ‌తి వాడికి రేపెలా అని ఆలోచిస్తాడు, ధ‌నికుడు భ‌విష్య‌త్ ఆలోచ‌ల‌న‌లు చేస్తాడు. మ‌న‌దేశంలో ఎక్కువ శాతం స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఎవ‌రంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే. కోరిక‌లు ఎక్కువ‌, సంపాద‌న త‌క్కువ .లేనిపోని ఆర్బాటాల‌ను ఆభ‌ర‌ణాలుగా చేసుకుని తిప్ప‌లు ప‌డి అప్పుల పాల‌యి దారి త‌ప్పి రోడ్డున ప‌డ‌తారు. అందుకే ఫ్యామిలీ ప్లానింగ్ చక్క‌గా చేసుకోవాలి.

ఫ్యామిలీ ప్లానింగ్ ( Family Planning) ఎలా చేసుకోవాలి?

ముందుగా ఒక ఉద్యోగి, సగటు మనిషి త‌న అదాయంమెంత‌, త‌న ఖ‌ర్చులేంటి, ఇంటి ఖ‌ర్చులేంటి, ఇవ‌న్నీ క్ర‌మం త‌ప్ప‌కుండా రాసిపెట్టుకోవాలి. మ‌ధ్య‌మ‌ధ్య‌లోఆసుప‌త్రులు, బంధువులు, అకాల వ‌ర్షాల్లాగ వ‌చ్చి వాలుతుంటారు. అలాంట‌పుడు బడ్జెట్ లో స‌మ‌స్య‌లు త‌లెత్తి అప్పులు చేయాల్సి వ‌స్తుంది. ఇక్క‌డే మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమిటంటే రోగాల‌కంటే అప్పు చేయ‌కత‌ప్ప‌దు. కానీ బంధువులు ఎక్కువ కాలం ఉంటే ఖ‌ర్చు త‌ల‌కు మించి భార‌మ‌వుతుంది, కాబ‌ట్టి నిర్మొహ‌మాటం అనే ఆయుధాన్ని లోప‌లినుంచి బ‌య‌ట‌కు తీసి మొహ‌మాటం లేకుండా మీ కున్న ప‌రిస్థితిని వివ‌రించాలి. ఆ త‌ర్వాత మీరు భ‌విష్య‌త్ లో కొంచెం వెనకేసుకున్నాక అప్ప‌టి ప‌రిస్థితి అలా ఉండేద‌ని వివ‌రించ‌వ‌చ్చు. కాబ‌ట్టి బంధం దూర‌వ‌మవ్వ‌దు.మీకు త‌ల‌కు మించిన భారం త‌గ్గుతుంది… క‌రెక్టే క‌దా.. ఒక్క సారి క‌ళ్లు మూసుకుని మ‌న‌న చేసుకుని ఆలోచించండి.

ఇక పిల్ల‌లు పుట్టాక స్కూళ్లు, పుస్త‌కాలు, ఎక్స‌ర్ష‌న్లు వ‌గైరాకు మ‌ళ్లీ ఖ‌ర్చు పెరుగుతుంది. కాబ‌ట్టి మ‌న ప‌క్కింటోడు పేరున్న స్కూల్లో చేర్పించార‌ని మ‌నం వాత‌లు పెట్టుకోకుండా స్థోమ‌త‌కు త‌గ్గట్టుగా ఎంచుకోవాలి.. ఏమంటారు… క‌రెక్టే అనిపిస్తుంది కానీ ప‌దిమందిలో త‌క్క‌వైపోతామ‌ని లోలోప‌ల ఏదో బాద క‌లుగుతుంది అదే మ‌రి మ‌ధ్య‌త‌ర‌గ‌తి మెంటాలిటీ..డోంట్ వ‌రీ బాస్ నువు ఈ రోజు చేసే పొదుపే త‌ర్వాత భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది..పిల్ల‌ల‌కు కూడా చిన్న‌ప్ప‌టి నుంచే పొదుపు,ప్లానింగ్ లు అల‌వాటు చేయాలి.

చ‌క్క‌ని చ‌క్క‌ని ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారిని ఒక ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. త‌న‌కున్న దాంట్లో తృప్తి ప‌డి,ఆర్భాటాల‌కు తావివ్వ‌కుండా సింపుల్ లైఫ్ ను గ‌డిపాడు. త‌న త‌ర్వాత ఆ వార‌స‌త్వాన్ని నాగార్జున‌కు ఇచ్చారు..

ఇలా చాలామంది చ‌క్క‌టి ప్లానింగ్ లో లైఫ్ లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్న‌వారు చాలామందే ఉన్నారు. సో ధింక్ బిఫోర్ స్పెంట్… ఏదైనా ఖ‌ర్చు చేయాలంటే ఆలోచించాలి బాస్.. ఒక‌టే జీవితం… పొదుపు చెయ్, ఎంజాయ్ చెయ్.. బ‌ట్ కేర్ ఫుల్ గా ఖ‌ర్చు చెయ్. ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ యువ‌ర్ ఫ్యామిలీ ప్లానింగ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -