ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

సినిమాల్లో ఛాన్స్ రావడమే పెద్ద విషయం. ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎలాగైన నిరూపించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం. అయితే కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాల్లో బాగానే చేసిన.. సినిమా హిట్ అయిన తర్వాత కూడా కనిపించకుండా పోతున్నారు. అలా కనుమరుగైన హీరోయినన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

రిచా: నువ్వేకావాలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత సరైన ఆఫర్స్ లేక పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
అన్షు: మన్మథుడు చిత్రంలో కాసేపు కనిపించినప్పటికీ అన్షు అందరినీ ఆకర్షించింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన అవి ప్లాప్ అయ్యాయి. దాంతో ఈమె కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
అనురాధ మెహతా : ఆర్య సినిమాలో గీతగా మెప్పించిన అనురాధ తర్వాత కనిపించకుండా పోయింది.
నేహా: నితిన్ తో కలిసి దిల్ సినిమాలో నటించి హిట్ అందుకున్న నేహా ఆ తర్వాత సైడ్ రోల్స్ చేసింది. ఆ తర్వాత కనిపించలేదు.
రేణు దేశాయ్ : పవన్ సరసన బద్రి కనిపించిన రేణు మళ్లీ జానీలోను కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు. ఈ మధ్య టీవీ షోస్ లో కనిపిస్తోంది.
భాను శ్రీ మెహ్రా : వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భాను శ్రీ మెహ్రా.. ఈ ఒక్క సినిమాతోనే కనుమరుగైంది.
మీరా చోప్రా : పవన్ కళ్యాణ్ పక్కన నటించే ఛాన్స్ బంగారం సినిమా ద్వారా సంపాధించింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ని ముద్ర వేసి ఈమెను పక్కన పెట్టారు.
నేహా శర్మ : మెగాస్టార్ తనయుడు చరణ్ తో కలిసి నేహా శర్మ వెండితెరకి పరిచయమైంది. గిలిగింతలు పెట్టింది. తర్వాత కొన్ని ఛాన్స్ అందుకున్నప్పటికీ నిలబడలేకపోయింది.
సియా గౌతమ్ : నేనింతే సినిమాలో సియా గౌతమ్ ని పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. అయినా సియా వేదం సినిమా తర్వాత ఎక్కడ కనిపించలేదు.
కార్తీక: జోష్, దమ్ము సినిమాల్లో నటించిన కార్తీకకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు కరువయ్యాయి. అందుకే ఆమె ఇటువైపు రాలేదు.

- Advertisement -

టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News