Sunday, April 28, 2024
- Advertisement -

గుమగుమలాడే.. నోరూరించే టమోటో -ఉల్లిపాయల చట్నీ ఎలా తయారు చేసుకోవాలంటే?

- Advertisement -

ఎప్పుడు కూరలు తిని మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చెట్నీ లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి నోటికి రుచిగా అనిపించే టమోటో – ఉల్లిపాయల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
బాగా పండిన టమోటాలు 6 ,పచ్చిమిర్చి 15,ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10,ఉప్పు తగినంత
నూనె కొద్దిగా, కొత్తిమీర తురుము కొద్దిగా

తయారీ విధానం:
*ముందుగా బాగా పండిన టమోటా పండ్లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను సన్నటి పొడవాటి ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి.

*ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి.

*పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసి అదే గోళంలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోకే కొత్తిమీరను వేసి వేయించుకోవాలి.

Also read:కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

  • ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలి.

*ఈ విధంగా టమోటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కాసేపు చల్లారనివ్వాలి.

  • ఈ పదార్థాలన్నీ చల్ల పడగానే ముందుగా రోలులో కొద్దిగా ఉప్పు వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బాలి.

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

  • పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయను మెత్తగా రుబ్బాలి. తర్వాత ఇందులోకి టమోటాలు వేసి బాగా రుబ్బాలి.

*ఈ మిశ్రమంలోకే కొత్తిమీర తురుము వేసి మరొకసారి రుబ్బితే ఎంతో రుచికరమైన టమోటో -ఉల్లిపాయల చట్నీ తయారైనట్లే. దీనిని మనం వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని లేదా రాగి ముద్ద కాంబినేషన్ లో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -