Thursday, April 25, 2024
- Advertisement -

గుండెజబ్బులు ఎక్కువగా మహిళలకు వస్తాయా..?

- Advertisement -

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో గుండెజబ్బుల సమస్య ఒకటి. గత దశాబ్ద కాలం వరకు ఎక్కువగా వృద్ధ వయసు వారు ఈ విధమైనటువంటి గుండెజబ్బుల బారిన పడేవారు. అయితే ప్రస్తుతం మారిన మన జీవన విధానాలకు అనుసరించి యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండెజబ్బులు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం అధిక ఒత్తిడి కలిగి ఉండటం, చెడు ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాల ముందు కూర్చుని పని చేయటం, ధూమపానం మద్యపానం అలవాటు ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా ఎక్కువగా ఈ విధమైనటువంటి జబ్బుల బారిన పడుతున్నారు.

ఈ విధంగా గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే యువత వారి ఆహార విధానంలో మార్పులు చోటుచేసుకోవాలి. ఎక్కువగా ప్రోటీన్లు ఒమేగా త్రీ యాసిడ్, పోషక పదార్థాలు, తాజా పండ్లను అధికంగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఈ విధమైనటువంటి గుండె జబ్బులు అధికంగా పురుషులకు వస్తాయని మహిళల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చాలా మంది చెబుతుంటారు.

Also read:రుచికరమైన బ్రేడ్ బోండా ఎలా చేయాలో తెలుసా?

మహిళల్లో గుండెజబ్బులు తక్కువగా వస్తాయి అనేది కేవలం అపోహ మాత్రమే. గుండె జబ్బులు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటాయని, హైపర్ టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె పోటు వంటి సమస్యలు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటాయి. అయితే మహిళల గుండె పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల వీరి గుండెలో ఏర్పడే సమస్యలను తొందరగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. మహిళలలో చేసే ఈ విధమైనటువంటి పరీక్షలు పురుషులలో చేయటం వల్ల వారిలో గుండె సమస్యను కనిపెట్టడానికి కాస్త ఆలస్యం అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also read:వేరుశెనగ పల్లీ కారం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -