Wednesday, May 7, 2025
- Advertisement -

బంగారు నానేల‌ను నిజాయితీగా పోలీసుల‌కు అప్ప‌గించిన మ‌హిళ‌

- Advertisement -
Land owner women finds 435 gold coins treasure hands over to cops

ప్ర‌పంచాన్ని శిశిస్తున్న‌ది డ‌బ్బు.మ‌నుషులంతా డ‌బ్బుకు బానిస‌లే.సొంతంగా సంపాదించుకున్న వాల్లు కొంద‌రైతే ….త‌ర‌త‌రాలుగా తిన్నా త‌ర‌గని ఆస్తిఉన్నా …డ‌బ్బుకోసం నీచ‌మై ప‌నులు చేస్తున్నారు.కాని ఒక పేద‌రాలు మాత్రం నిజాయితీకి నిలువు ట‌ద్దంలా నిలిచింది.అయితే ఈస్టోరీ చ‌ద‌వండి.

ఆమె అనుకుంటే ధనవంతురాలై పోవచ్చు.. రోజుకో బంగారు నాణాన్ని డబ్బుగా మార్చుకొని దర్జాగా బతికేయొచ్చు. కానీ, పేరుకు పేదళ్లం అయినా తమలో నిజాయితీ తప్పకుండా ఉంటుందని ఓ మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ నిరూపించింది. తన ఇంటికోసం తీస్తున్న పునాదిలో దాదాపు 435 పురాతన బంగారు నాణేలు బయటపడినా వాటిల్లో ఏ ఒక్కటి తను ఉంచుకోకుండా గ్రామస్తులు ఇచ్చే సలహాను పట్టించుకోకుండా నేరుగా పోలీసులకు అందించి మన్ననలు పొందింది.

{loadmodule mod_custom,Side Ad 1}

వివరాల్లోకి వెళితే.. సరిగ్గా బెంగళూరుకు 100 కిలో మీటర్ల దూరంలోని బాణ సముద్ర అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ ఉంది. ఆమె తనకు ఓ ఇంటిని నిర్మించుకునేందుకు శంఖుస్థాపన కోసం గుంట తవ్వడం ప్రారంభించింది.ఆ పనిలో నిమగ్నం కాగా అందులో నుంచి తొలుత కొన్ని నాణేల మాదిరిగా బయటకొచ్చాయి. అవన్నీ బురదమయమై ఉన్నాయి.

అలాగే, ఇంకొంచెం తవ్వగా ఏకంగా 400కు పైగా నాణేలు బయటకొచ్చాయి. వీటిని అనంతరం శుభ్రం చేయగా అవి బంగారు నాణేలు అని దాదాపు గుర్తించారు. అయితే, గ్రామస్తుల్లో కొందరు వాటిని స్వర్ణకారులకు చూపించమని, ఎవరికీ చెప్పకుండా ఆమెతోనే ఉంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా నేరుగా వెళ్లి పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి వాటని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో ద్వారా ప్రభుత్వానికి అప్పగించగా వాటిని పురావస్తు శాస్త్రవేత్తలకు పరిశీలన కోసం అప్పగించారు.విన్నారుగా ఆపేద‌రాలి నిజాయితీ.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ఆమె రూపొందించిన డ్ర‌స్సుకు ఒ ప్ర‌త్యేక‌త ఉంది…
  2. 30 ట‌న్నుల పొక్లెయిన్‌ను అమాంతం ఎత్తిన రియ‌ల్ బాహుబ‌ళి…..
  3. ఆరోగ్య గ‌ని నేరేడు పండ్లు….
  4. సంవ‌త్స‌రం పాటు ఉచిత ఇంట‌ర్నెట్ స‌దుపాయంతో మైక్రోమ్యాక్స్ కొత్త పోన్‌ను …

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -