Sunday, April 28, 2024
- Advertisement -

బెంగళూరు దారుణం.. 6 వేల మంది కరోనా రోగులు అదృశ్యం?

- Advertisement -

కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరు వేల మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా సెకండ్‌వేవ్‌ ధాటికి భయాందోళనలకు గురవుతుంటే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు తిన్నగా ఐసోలేషన్‌లో ఉండక ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు కొన్ని వేల మంది అదృశ్యమయ్యారట.

నగరంలో దాదాపు 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో 10,835 మంది అదృశ్యం కాగా వారి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. ప్రస్తుతం మళ్లీ 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఇంతకు ముందు కూడా ఓ పది వేల మంది కనిపించకుండా పోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు మళ్లీ ఆరు వేల మంది ఇలా అదృశ్యం కావడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. సమాచారం ఇవ్వడమే కాకుండా తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ఛాఫ్‌ చేసి పెట్టుకున్నారట. కొందరు కరోనా వైరస్ సోకగానే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో పాజిటివ్‌ వచ్చిన వారిని కనిపెట్టడం సమస్యగా ఉందని పోలీసులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారు స్థలాలు మారడంతో కరోనా వైరస్ మరికొంతమందికి అంటుకుంటుందన్నారు.

కరోనా వైరస్ గాలిలో 6 అడుగుల వరకు వ్యాప్తి.. జర జాగ్రత్త!

తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -