Friday, March 29, 2024
- Advertisement -

ఆరోగ్య గ‌ని నేరేడు పండ్లు….

- Advertisement -

మ‌నిషి ఆరోగ్యంగా ఉంటె అంత‌కంటె మాహాభాగ్యం ఏముంటుంది.అనారోగ్యాల కార‌నంగా ల‌క్ష‌లు డ‌బ్బును ఖ‌ర్చుపెడుతున్నారు.కాని మ‌న ఆరోగ్యం మ‌న‌చేతుల్లోనే ఉంది అనే విష‌యం తెలిసి కూడా న‌ర్ల‌క్ష్మం వ‌హిస్తుంటారు.సీజ‌న్‌లో దొరికే పండ్లు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.వాటిలో నేరేడు పండ్లు ఒక‌టి.

నిగ‌నిగ‌లాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్ర‌మే మార్కెట్లో ఉంటాయి. వాటిని తిన‌డం వ‌ల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేటు చేస్తాయి.వీటిలో చాలా ర‌కాలున్నాయి.కోల‌గా ఉండ పెద్ద‌గా ఉండే వాటిని అల్ల నేరేడ‌ని…గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడ‌ని పిలుస్తారు.నేరేడు పండ్లు భార‌త్‌,పాకిస్థాన్‌,ఇండోనేషియాల‌లో విరివిగా ల‌భిస్తాయి.వీటిల్లో ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలుకుందా.

నేరేడు వ‌ల్ల క‌లిగే లాభాలు….

1. నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి.

2. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుతాయి.ఇందులోని పోషకాలు గ్లైసమిక్‌ ఇండెక్స్‌ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధీ జరుగుతుంది.

3. నేరుడు పండులో ఉండే గుణాలు కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే నేచుల్ ఆమ్లాలు జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

4. నేరేడులో ఉండే బయోయాక్టివ్ ఫోటో కెమికల్స్, పాలిఫినోల్స్ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. కీమోథెరఫీ వంటి క్యాన్సర్ చికిత్సలు చేయించుకునే సమయంలో నేరడు పండ్లను ఆహారంగా తీసుకోవటం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా రక్షస్తుంది.

5. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంతŒ తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.

6. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

7. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

8. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -