Thursday, April 25, 2024
- Advertisement -

మెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు?

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవికి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.
కొంత కాలం పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ తిరిగి “ఖైదీ నెంబర్ 150″ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మెగా స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన” సైరా నరసింహారెడ్డి “మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా “ఆచార్య” కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత చిరంజీవి రీఎంట్రీ మూవీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆటోజానీ’అనే సినిమాను చేయాలనుకున్నారు. కానీ సెకండాఫ్ బాగాలేదని చెప్పి ఈ స్టోరీని పక్కనపెట్టేసారు చిరంజీవి. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నంబర్ 150’తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు

Also read:సాయి పల్లవికి పొగరు.. నిర్మాత కూడా సీరియస్..?

చిరంజీవి కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి మధ్యలో తిరస్కరించిన సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ‘భూలోకవీరుడు’ అనే జానపద మూవీని ప్రారంభించి కొన్ని కారణాల వల్ల మధ్యలోనే తప్పుకున్నాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘చెప్పాలని వుంది’ ,హాలీవుడ్ డైరెక్టర్, సురేష్ కృష్ణ సంయుక్త దర్శకత్వంలో ప్రారంభమైన ‘‘అబూ బాగ్దాద్ గజదొంగ’, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘వజ్రాల దొంగ’ ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవితో మధ్యలోనే ఆగిపోయిన సినిమాల లిస్ట్ చాలానే ఉంటుంది. ఇలా చిరంజీవి ఒక రికార్డు క్రియేట్ చేశారని చెప్పవచ్చు.

Also read:టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -