Saturday, April 27, 2024
- Advertisement -

స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న సోనూసూద్.. నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో ఎంతో మంది పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. వెండి తెరపై విలన్ గా నటించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరో అయ్యాడు. ఎంతో మంది వలస కూలీలకు దైవంగా మారారు.. అది ఎంతగా అంటే ఆయన సహాయం పొందిన వారు సోనూ సూద్ బొమ్మను ఇంట్లో పెట్టుకొని దైవంగా కొలుస్తున్నారు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సోనూ సూద్ మరింత సహాయన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్న వేళ నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు హీరో సోనూసూద్. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు.

ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణం. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఎంతో ఆవేదన చెందారు. తన మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లారు. సోనూసూద్‌ ను జిల్లా కలెక్టర్‌ తో ఫోన్ లో మాట్లాడించారు. జిల్లాకు ఏ అవసరం ఉంది.. తాను ఏం చేయగలను అంటూ సోనూసూద్‌ ప్రశ్నించగా కలెక్టర్‌ జిల్లాలో ఒక ఆక్సీజన్‌ ఉత్పత్తి తయారి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు.

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని పేర్కొన్నారు.

చిన్నవయసులో ఆ పని తెలియక చేశానంటున్న నటి?

అది చాలా మిస్ అవుతున్న: యాంకర్ అనసూయ

నేను నోరు విప్పితే తట్టుకోలేవ్ ఈటెలా.. : మంత్రి గంగుల కమలాకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -