Saturday, May 18, 2024
- Advertisement -

‘కాపులకి 100 కోట్లు ఏ మూలకి ?’

- Advertisement -

పోయిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపుల ఓట్ బ్యాంకు కోసం అంటూ మెజారిటీ కులాల్లో ఒకటి అయిన వారి ఓటు బ్యాంక్ కోసం పవన్ కళ్యాణ్ అనే భ్రమాస్త్రాన్ని ప్రయోగించారు చంద్రబాబు. ఈ పని చేయడం వల్లన జగ వైపు వాలిపోవాల్సిన కాపు ఓట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి అనేది ఒక భారీ వాదన. పవన్ తో పాటు కాపులని బీసీల్లో చేర్చే అంశం మీద కూడా బాబుగారు పెద్ద హామీనే ఎన్నికల సమయంలో వాడేసారు ఇది కూడా చాలా గట్టిగా వర్క్ అయ్యింది అని అంటున్నారు. 

కాస్త లేట్ అయినా బాబుగారికి ఆయన ఇచ్చిన హామీలు గుర్తుకు వచ్చాయ్. ఒక వైపు మిత్రపక్షం అయిన  బీజేపీ ఏపీ లో కాపులని దగ్గర చేసుకుని ఆ కులానికి ఏ ప్రత్యేక పార్టీ లేకపోవడం తో వారికి ఆధరవు గా నిలుద్దాం అని అనుకుంటున్న సమయంలో వారి ఓటు బ్యాంక్ విషయంలో టీడీపీ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. “కాపుల్ని బీసీలలో చేర్చడం” అనే అంశం మీద కొత్త కహానీ మొదలు పెట్టి ఈ విషయమై కమిటీ వెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికిప్పుడే కాపుల అభివృద్ధి కోసం అంటూ ఒక వందకోట్లు కేటాయించి అది పూర్తి అవ్వగానే మళ్ళీ ధనం ఇస్తాం అని అధికారికంగా ప్రకటించారు.

 ఈ విషయం మీద ఆ సామాజిక వర్గం సంతృప్తిగా లేదు అని విశ్లేషకులు అంటున్నారు. కాపు సంఘం అధ్యక్షుడు నారాయణ స్వామీ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, బాబు కేటాయించిన వందకోట్ల తో పాటు బీసీలలో చేర్చే విషయం లో కమీషన్ వెయ్యడం ఆలస్యం అవ్వడాన్ని కూడా ఆయన తప్పు పడుతున్నారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఇవ్వాలి అని ఇప్పుడు ఇస్తున్న వందకోట్లు ఏ మూలకి సరిపోతాయి అని అయన స్వయంగా వ్యాఖ్యానించారు. బాబు ఒక్కొక్కటి గా అన్నీ చక్కబెడుతున్న సమయంలో పనిచేయడం మొదలు పెట్టిన తరవాత కూడా అడ్డు చెప్పడం సబబా అనేది వారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -