Friday, May 17, 2024
- Advertisement -

దేశాన్ని తాకట్టు పెట్టే విషయంలో కాంగ్రెస్‌కి ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకున్న మోడీ

- Advertisement -

నరేంద్రమోడీని భారతీయ ఓటర్లందరూ మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నమ్మారు. గతంలో నాయకులు మోసం చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు మరోసారి ఒక నాయకుడిని మనస్ఫూర్తిగా నమ్మడానికి కొన్ని దశాబ్ధాలే పట్టింది. అలా భారతీయులందరూ తనను నమ్మేలా చేసుకోవడంలో మోడీ వంద శాతం సక్సెస్ అయ్యాడు. అందుకే మోడీకి అద్వితీయమైన, అద్భుతం అనే స్థాయి విజయం దక్కింది. ఆ స్థాయి విజయం సాధించిన తర్వాత దిక్కుమాలిన ఓట్లు, సీట్లు రాజకీయం వదిలేసి దేశాభివృద్ధి కోసం పనిచేస్తాడని భారతీయులు నమ్మారు. అందుకే పూర్తి మెజారిటీ ఇచ్చారు. కానీ మోడీ మాత్రం ఫక్తు రొటీన్ రొడ్డకొట్టుడు రాజకీయాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. మూడున్నరేళ్ళ తర్వాత కూడా నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలనే తన విజయాలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి మోడీది. ఓడిపోయిన ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలతో సహా ఎన్నికలు ఎదుర్కున్న అన్ని రాష్ట్రాల్లోనూ మోడీ చేసింది రాజకీయమే. ఎక్కడా కూడా తాను చేసిన అభివృద్ధిపై నమ్మకంతో ఓట్ల గోదాలోకి దిగే దమ్ములేకుండా పోయింది ఈ భారీ ఛాతీ వీరుడికి.

ఇక ఇప్పుడు గుజరాత్ ఎన్నికల సమయంలోనైతే ఏకంగా దేశ ప్రయోజనాలనే తాకట్టుపెట్టేస్తున్నాడు మోడీ. సోనియా జమానా ఉన్నంత కాలం టెర్రరిస్ట్‌లను దేశభక్తులుగా చూసిన పరిస్థితి. టెర్రరిస్టులను ఏమైనా విమర్శిస్తే ఎక్కడ మైనారిటీలకు కోపం వస్తుందో అని బుజ్జగిస్తూ కూర్చున్నారు. పాకిస్తాన్ విషయంలో కూడా ఒక స్పష్టమైన వైఖరి లేకుండా నాన్చుడు వ్యవహారంతో కాలం వెల్లిబుచ్చారు. అందుకే పాకిస్తాన్‌ని ఏదో చేస్తా? ఇండియాను ఎక్కడికో తీసుకెళ్తా అంటూ మోడీ ఉత్సాహపూరితంగా మాట్లాడగానే ప్రజలు కూడా నమ్మారు. కానీ మోడీ మాత్రం పాకిస్తాన్ ఇష్యూని ఓట్ల కోసం వాడుకోవడంపై దృష్టిపెడుతూ దేశప్రయోజనాలను తాకట్టుపెట్టేస్తున్నాడు. టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఇండియా ఆరోపించినప్పుడల్లా పాకిస్తాన్ చేసే ప్రత్యారోపణలకు ఇంకాస్త బలాన్ని ఇస్తున్నాడు మోడీ. ‘ఇండియాలో ఏం జరిగినా పాకిస్తాన్‌ని తిట్టడం ఇండియా పాలకులకు అలవాటు. పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్ల కోసం డ్రామాలు ఆడుతూ ఉంటారు’ అన్నది ఇండియన్ పాలకులపై పాకిస్తాన్ మోపే అభియోగం. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తున్నాడు మోడీ. గుజరాత్ ఎన్నికల్లో పోటాపోటీ పోరు తప్పదన్న సర్వేల అంచనాలు, బిజెపి ఓడిపోయే అవకాశం ఉందన్న సర్వేల నేపథ్యంలో నరేంద్ర మోడీ భారతదేశ ప్రయోజనాలను ఆ రకంగా తాకట్టుపెట్టడానికి రెడీ అయిపోయాడు. అత్యద్భుతమైన మెజారిటీతో దేశ ప్రధానిగా ఉన్న నాయకుడు ఒక రాష్ట్రంలో గెలుపుకోసం ఈ స్థాయికి దిగజారడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఈ స్థాయి దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ కూడా ఎప్పుడూ చేసింది లేదు.

కాంగ్రెస్ పార్టీ అధినేతల మత విశ్వాసాలను కూడా విమర్శిస్తూ…….ఆరెస్సెస్, బిజెపిలు మాత్రమే ధేశభక్తికి ప్రతీకలు అన్నట్టుగా మాట్లాడే దేశభక్త్స్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒక రాష్ర్ట ఎన్నికల్లో గెలుపు కోసం దేశ ప్రయోజనాలను కూడా తాకట్టుపెట్టే నాయకుడి దేశభక్తి గురించి దేశభక్త్స్‌ మాట్లాడాలి. మోడీకి వ్యతిరేకంగా విరుచుకుపడిపోయే బ్యాచ్ అందరూ ఇప్పుడు మోడీ చేస్తున్న ఓట్లు-సీట్ల స్వార్థ రాజకీయాన్ని సమర్థిస్తారా? ఇక సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని కూడా గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండడం దిగగజారుడుకు పరాకాష్ట. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోందన్న మోడీ మాటలు అయితే ఆలోచనాపరులకు జుగుప్స కలిగించే స్థాయిలో ఉన్నాయి. దశాబ్ధాలుగా గుజరాత్‌ని పాలిస్తున్న మోడీ వారి బిజెపికి తాము చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకుని అధికారంలోకి వచ్చే సీన్ లేకుండా పోయింది. ఇక్కడే గుజరాత్ మోడల్ అభివృద్ధిలో డొల్లతనం బయటపడుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారం పుణ్యమాని మోడీ వారి ప్రభ భారీ స్థాయిలో మసకబారిందని చెప్పడానికి మాత్రం సందేహం అక్కర్లేదు. అయితే సోనియా, మోడీల నుంచీ మన నాయకుల మాటల్లో కనిపించే దేశభక్తి చేతల్లో మాత్రం అస్సలు లేకుండా పోవడం మాత్రం దేశం గురించే ఆలోచించే వాళ్ళలో ఆందోళన పెంచుతుందన్న విషయం మాత్రం నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -