Thursday, May 2, 2024
- Advertisement -

అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

- Advertisement -

సౌత్ ఇండియా అగ్ర హీరో కమల్ హాసన్ నట వారసురాలిగా వెండితెరపై మెరిసిన శృతి హాసన్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. శృతిహాసన్ టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న సమయంలోనే ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో ప్రేమలో పడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్అప్ చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతోనే పలు భారీ బడ్జెట్ మూవీల్లో అవకాశాలు దక్కించుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి హాసన్ తన తల్లితండ్రుల విడాకుల గురించి ప్రస్తావించింది. కమల్ హాసన్, నటి సారిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా శృతిహాసన్‌ రెండో సంతానంగా అక్షర హాసన్‌ జన్మించారు. సాఫీగా సాగుతున్న వీరి దాంపత్యం జీవితంలో కొన్ని విభేదాల కారణంగా 2004లో విడిపోయారనీ, విడిపోయిన తర్వాతే వీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!

శృతిహాసన్ హీరోయిన్ గా రీ ఎంట్రీ మూవీ సంక్రాంతి కానుకగా రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించింది.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘సలార్’లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Also read:ఈ హీరోయిన్లను పరిచయం చేసింది పూరీ జగన్నాదే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -