Tuesday, April 30, 2024
- Advertisement -

యువతిని చంపి శవం వద్ద డ్యాన్స్ చేసిన యువకుడు!

- Advertisement -

ఇటివలే ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన అందరిని షాక్ చేస్తోంది. ఓ కిరాతకుడు యువతిని ఇష్టం వచ్చినట్లు కత్తితో పోడిచి చంపేసాడు. తర్వాత మృతదేహం వద్ద డాన్స్ కూడా చేసాడు. నడిరోడ్డుపై యువతిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత డాన్స్ చేయడం చూసి అక్కడ ఉన్నవారు బిత్తరపోయారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

ఆ సమయంలో ఆపేందుకు చాలా ప్రయత్నించానని, కానీ ఎవరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు అని ఆ సాక్షి చెబుతున్నాడు. యువతిని పొడిచిన తర్వాత మృతదేహం వద్ద నిందితుడు డ్యాన్స్ చేశాడని అతను చెప్పాడు. ఈ ఘటనపై నార్త్ ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ మాట్లాడుతూ.. ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో ఉందని బావించిన నిందితుడు ఇలా చేశాడు అని తెలిపారు.

ఇక హత్యకు గురైన యువతి కరుణ నావెల్ రీచెస్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మనీష్ కుమార్ అనే సాక్షి కరుణను ఆటో రిక్షాలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. తాను యువతికి సాయం చేయడానికి వెళ్లానని, రెండు సార్లు 100కు ఫోన్ చేశానని, పోలీసులు రాలేదని, దాంతో ఆ తర్వాత తాను అంబులెన్స్‌కు ఫోన్ చేశానని మనీష్ కుమార్ అనే వ్యక్తి చెప్పాడు.

Related

  1. ఫేస్ బుక్ ద్వారా లక్షలు వెనకేసిన యువకుడు!
  2. ‘మొదటి పెళ్లి చూపులు’ తో ఊహించని షాక్ ఇచ్చిన నిహారిక!
  3. స్టేజీ మీద చరణ్ కి షాక్ ఇచ్చిన బన్నీ!
  4. నాగార్జున కి షాక్ ఇచ్చిన మేనల్లుడు సుశాంత్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -