Thursday, May 16, 2024
- Advertisement -

‘మొదటి పెళ్లి చూపులు’ తో ఊహించని షాక్ ఇచ్చిన నిహారిక!

- Advertisement -

నాగబాబు కుతురు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక ఈ వెబ్ సిరిస్ లో నటించడంతో పాటు ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బేనర్ కూడా స్థాపించింది. అయితే ‘ఒక మనసు’ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే నిహారిక తన రెండో సినిమా ఎప్పుడు చేస్తుంది అని ఎదురు చూస్తున్నసమయంలో అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది నిహారిక.

త్వరలో తన సొంత బేనర్ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ లో రెండో వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటిచారు. ఈ వెబ్ సిరీస్ ‘మొదటి పెళ్లి చూపులు’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ‘మా తర్వాతి పింక్‌ ఎలిఫెంట్‌ ప్రాజెక్టు ఇదిగో.. హరీష్‌ నాగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌’ అని నిహారిక పోస్ట్‌ చేసిన ఆమె ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఈ కొత్త వెబ్ సిరీస్ లో నిహారిక నటించడం లేదు. ఓ కొత్త అమ్మాయి నటిస్తోంది. ఇక నిహారిక రెండో సినిమాకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పంజాబీ సూపర్ హిట్ అయిన ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ సినిమాకి కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. హీరోగా ‘పెళ్ళిచూపులు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఓకే కాలేదు.

Related

  1. ఖైదీ సినిమాలో నిహారిక ?
  2. అయ్యో నిహారిక.. మళ్లీ అదే పనా?
  3. వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?
  4. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -