Sunday, May 19, 2024
- Advertisement -

బాబును న‌మ్మ‌లేమంటున్న ప్రాంతీయ పార్టీల నేత‌లు

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌ర‌శైలిపై దేశం మొత్తం ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. అందింతే జుట్టు.. లేదంటే కాళ్లు.. ఇది చంద్ర‌బాబు నైజం అంటూ ఇప్పుడు వివిధ ప్రాంతీయ పార్టీల‌ నేత‌లు గుస‌గుస‌లు కాదు.. బాహ‌టంగానే అంటున్నారు. చంద్ర‌బాబు కేవ‌లం త‌న అవ‌స‌రాల కోసం మాత్రమే మ‌న‌తో క‌లుస్తున్నారు… తనపై కేసుల కారణంగా వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రమే బీజేపీ వ్యతిరేక కూటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు. చంద్ర‌బాబుకు విశ్వ‌స‌నీయ‌త‌.. ఓ సిద్ధాంతం అంటూ లేద‌ని.. ఆయ‌న అధికారం కోసం ఎంత‌కైనా తెగిస్తార‌ని అంటున్నారు. అవ‌స‌ర‌మ‌నుకుంటే రెండు వైరుధ్య సిద్ధాంతాలున్న బీజేపీతోను, వామపక్షాలతోనూ కూడా కలుస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ మూడున్నర దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే కలివ‌డ‌మే అంటున్నారు.

మోదీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే నాలుగున్న‌రేళ్లు పాటు క‌లిసి ఉన్న బాబు.. హ‌ఠాత్తుగా ప్లేట్ ఫిరాయించ‌డంతో పాటు ఇత‌ర ప‌క్షాల‌తో క‌లిసి కూట‌మి ఏర్పాటుకు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నార‌ని.. ఇందులో ఆయ‌న స్వార్థ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతేకాదు ఒకవేళ ఎన్నికల అనంతరం యునైటెడ్ ఫ్రంట్ కు అశించినన్ని స్ధానాలు రాకపోతే వెంటనే నరేంద్ర మోడీ చెంతకు చేరిపోతారనే అనుమానం వివిధ పార్టీలకు చెందిన వారిలో కనపడుతోంది. చంద్ర‌బాబుకు గాలి ఎటు వీస్తే అటు వాలిపోవ‌డం వెన్న‌తో పెట్టిన విద్య అని ఇంత‌కు ముందు కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి…. ఎన్నికలు కాగానే బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి వెంటనే ప్లేటు ఫిరాయించి బీజేపీలోకి జంప్ అయ్యాడని…. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు.

చంద్ర‌బాబు గురించి ఇన్ని తెలిశాక కూడా ఆయ‌న‌తో సఖ్యంగా మెలగాలా..? ఎంత వరకూ ఆయనను నమ్మవచ్చు..? అన్నది బేరీజు వేసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇక తెలుగుదేశంతో పొత్తు వ‌ద్దు మొర్రో అని ఏపీ కాంగ్రెస్ నేత‌లు హైక‌మాండ్‌కు మొర‌పెట్టుకుంటున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా చంద్రబాబును న‌మ్మ‌డానికి రాజ‌కీయ పార్టీలు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నార‌నేది రాజ‌కీయ విశ్లేషకుల మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -