వైఎస్, జగన్ అభిమానులు ఎప్పుడూ ఒక విషయంలో ఫీల్ అవుతూ ఉంటారు. ప్రచారం విషయంలో టిడిపి కంటే వెనుకబడిపోతున్నామని. అయితే తాజాగా జగన్ ఫ్యాన్స్ రూపొందించిన ఒక సాంగ్ టిడిపి సాంగ్స్‌ని మించిపోయేలా ఉంది. సాక్షి మీడియా ఉన్నప్పటికీ బాబు భజన మీడియా అయిన జ్యోతి, ఈనాడులను బీట్ చేయలేకపోతున్నారు వైకాపా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో మాత్రం కాస్త బెటర్. ఇక సినిమా వాళ్ళ దన్ను బలంగా ఉండే టిడిపికి పాటల విషయంలో లోటే లేదు.
అయితే ఇప్పుడు పార్టీల సాంగ్స్ అన్నింటినీ మించి ఉండేలా…….అన్నింటికీ మించి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌ల సింపుల్ వ్యక్తిత్వం, మానవత్వపు లక్షణాలు, మనుషులతో సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే లక్షణాలన్నీ చూపించేలా చేసిన వీడియో అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ హయాంలోనూ, ఇప్పుడు కూడా అత్యంత ఎక్కువగా జనాకర్షణ ఉన్న నేతలు వైఎస్సార్, జగన్‌లే. ఈ విషయం వైస్సార్, జగన్ సభలకు వచ్చిన జనాల వీడియోలను యూట్యూబ్‌లో చూసినా కూడా తెలిసిపోతుంది. అలాంటి అత్యద్భుత జనాదరణ ఉన్న వైఎస్‌ల సభలు, యాత్రల విజువల్స్‌ని చాలా బాగా చూపించారు. సాంగ్ లిరిక్స్ కూడా వైకాపా అభిమానులకు అమితానందం ఇచ్చేలా ఉన్నాయి. న్యూ ఇయర్ టైంకి ఈ పాట సోషల్ మీడియాలో టాప్ రేంజ్‌లో ట్రెండ్ అవుతూ ఉండడం వైకాపా అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. వైఎస్ జగన్ ఎన్ఆర్ఐ అభిమానులు రూపొందించిన ఈ పాటన వైకాపా అభిమానులతో పాటు తెలుగు ప్రజలందరినీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రశంశలు దక్కించుకుంటూ ఉంది.
- బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయం..
- విశాఖ – బెంగళూరు వందేభారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్, రూట్ ఇలా..
- అరుణాచలం వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు.. మోక్ష మార్గంలో వారికే అనుమతి..
- ఇక్కడకు రావద్దు.. విజయ్ కు డీకే శివకుమార్ విజ్ఞప్తి.. ‘జననాయగన్’ నిలిపివేత
- కోర్టుకు హాజరైన కేటీఆర్..ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
- జగన్ రాకతో పోటెత్తిన ఉత్తరాంధ్ర.. ఆంక్షలు చేధించి
