- Advertisement -

కెసిఆర్ కి షాక్ ఇచ్చేలా గులాబీ నేతను రంగంలో కి దించిన కాంగ్రెస్..?

- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి  గ్రామస్థాయిలో నేతలను నియమించి ప్రచారానికి తెరలేపినంత పని చేస్తుంది.. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించింది. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఒక్కొక్క గ్రామానికి ఇన్ ఛార్జిని నియమించి వారికే పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేంత వరకూ వారిదే బాధ్యత. హరీష్ రావు కూడా తన నియోజకవర్గంలో కూడా చేయనంత పోరాటం ఇప్పుడు చేస్తున్నారు.. వాస్తవానికి హరీష్ ఇంత చేయడానికి లేదు. ఎందుకంటే దుబ్బాక లో ఇంకా అధికార పార్టీ వైపే గాలి వీస్తుంది.. పైగా చనిపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎలాగ సింపతీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనభై శాతం గులాబీ పార్టీ కే గెలిచే సూచనలు ఉన్నాయి..

అయితే అధికార పార్టీ కి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక లో విజయ కేతనం ఎగురవేయడానికి ఓ ఎత్తుగడ వేసింది.. టీఆర్ఎస్ నుంచి వస్తాడని ఆశలు పెట్టుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం ఈ ప్రచారాన్ని చేశారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఖరారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరాలన్న పట్టదలతో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన అనుభవం ఉండటంతో.. ఆ పరిచయాలతో.. టీ పీసీసీ స్థాయిలో ఆయనను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అన్నీ ఒకే అయితే టీ ఆర్ ఎస్ కు పోటీగా ఈయనను కాంగ్రెస్ తరపున దింపే ప్రయత్నాలు జరుగుతాయన్నమాట..

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

కేసిఆర్ పైన కోదండ రాం ఎత్తులు ఫలించేనా..?

దుబ్బాక లో హరీష్ టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగించేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -