Tuesday, May 21, 2024
- Advertisement -

అస‌లు కిటుకు అంతా అక్క‌డే ఉందా…?

- Advertisement -

ఏపీలో ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న హామీల‌పై రాజ‌కీయాలు ప‌తాక‌స్థాయికి చేరాయి. ఇప్ప‌టికే అన్ని రాజ‌కీయా పార్టీలు తూతూమంత్రంగా పోరాడుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అన్ని పార్టీలు క‌ల‌సి పోరాడితే ఎందుకు సాధించ‌రు అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల‌యిన టీడీపీ, వైసీపీలు కేంద్రానికి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో అర్థం కావ‌డంలేద‌నే వార్త‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వారి వ్య‌క్తిగ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోస‌మే బ‌లంగా పోరాడ‌టంలేద‌నే అనుమానాలు అన్ని రాజ‌కీయ‌పార్టీలు,ప్ర‌జ‌ల‌నుంచి వ‌స్తున్న అనుమానాలు. అస‌లు బాబు , జ‌గ‌న్ ఎందుకు మోదీకి భ‌య‌ప‌డుత‌న్నార‌ని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

ఇద్ద‌రు క‌ల‌సి పోరాడితే ప్ర‌త్యేక‌హోదా క‌శ్చితంగా వ‌స్తూంది. కాని ఎందుకు ఇద్ద‌రు క‌ల‌సి పోరాటం చేయ‌డంలేదు…? వ‌్య‌క్తిగ‌త రాజ‌కీయాల‌కోస‌మే తూతూమంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ర‌నే వార్త‌ల‌తోపాటు ఇద్దరిపైన ఉన్న కేసులే అని ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణం త‌ర్వాత‌ జగన్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారంతో కు సమస్యలు మొదలయ్యాయి. అప్ప‌ట్లో కాంగ్రెస్‌,టీడీపీ క‌ల‌సే జ‌గ‌న్‌మీద అక్ర‌మంగా కేసుల వేశార‌నే వ్యాఖ్య‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ కొన్ని కేసులు వీగిపోయినా కొన్నింటిలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కేసులన్ని కూడా కేంద్రంలోని సిబిఐ చేతిలో ఉండటంతో జగన్ కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉండక తప్పటం లేదు.

అదే స‌మ‌యంలో ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. దీనితోపాటు అనేక కేసుల‌పై స్టేలు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ఎప్పుడు విచార‌ణ‌కు వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.కేసు విచారణ గనుక మొదలైతే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకోవటం ఖాయం.

ఒకవైపు జగన్ కేసుల్లో నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తుండటం, అదే సమయంలో చంద్రబాబులో టెన్షన్ పెరుగుతుండటంతో ఇద్దరూ కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు తహతహలాడుతున్నార‌నే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఎవ‌రిమీద ఎన్ని కేసులున్నా అంతిమంగా రాష్ట్రానికి ఎంత వ‌ర‌కు న్యాయం చేస్తార‌నేది మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -