Thursday, May 16, 2024
- Advertisement -

లక్ష కోట్ల స్కామ్ ఆరోపణలపై మౌనమేల ?

- Advertisement -

కన్నడ సినీనటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ రమ్య ప్రధాని నరేంద్రమోడీ పై పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మోడీ తన చిత్రపటంపై చోర్ (దొంగ) అని రాస్తున్నట్టు ఉన్న ఫొటోను రమ్య పోస్ట్ చేశారు. దాని కింద దొంగ పీఎం మౌనంగా ఉన్నారు. అని హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. మాటాడితే విపక్షాలపై విరుచుకుపడిపోయే ప్రధాని మోడీ రాఫెల్ కుంభకోణం ఆరోపణలపై మాత్రం కొద్దిరోజులుగా నోరు విప్పడం లేదు. దేశమంతా మాట్లాడుతున్నా, కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మండిపడుతున్న, లక్ష కోట్ల రూపాయల స్కెచ్ అని ఆరోపణలు వస్తున్నా మోడీ మౌనంగా ఉండటంతో రమ్య ఈ విధంగా స్పందించింది. అయితే ఈ పోస్టు చేసినందుకు ఓ బీజేపీ కార్యకర్త ఆమె రాజద్రోహం ఆరోపణలతో కేసు పెట్టారు.

అయితే రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం 40 వేల కోట్లకు పరిమితమైంది కాదని, లక్ష కోట్లు దాటే ఉంటుందని కాంగ్రస్ ఆరోపిస్తోంది. ముందు 36 విమానాలతో పాటు తర్వాత మరో 10 విమానాల తయారీ కాంట్రాక్టు, ఫ్రెంచి కంపెనీ ద్వారా అనిల్‌ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్లాన్ వేసిందని ఆరోపిస్తున్నారు. భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అన్ని అర్హతలు ఉన్నా, దాన్ని కాదని, ఏ అనుభవం, అర్హత లేని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు ఎలా కట్టబెట్టారని రాహుల్ ధ్వజమెత్తుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. 18 విమానాలు అక్కడే తయారు చేసి ఇండియాకు సరఫరా చేశాక, మిగిలిన వాటిని ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా భారత్ లో చేయడానికి ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని మోడీ ఎందుకు రద్దు చేశారో ? అంబానీ కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఎందుకు చెప్పారో ? తెలపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీటిపై రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులు చేస్తున్న ప్రకటనలు పొంతన లేకుండా ఉన్నాయి. దేశ రక్షణ అంశాలను రాజకీయంగా వాడుకుంటున్నారు, యుద్ధ విమానాల కొనుగోలు డీల్ బయట పెడితే దేశరక్షణకు నష్టం అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ మాత్రం నోరు విప్పడం లేదు. అవకాశం దొరికితే చాలు విపక్షాల మీద మాటల గారడీతో విరుచుకుపడిపోయే ఆయన సైలెంట్ అయిపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య చేసిన చోర్ పోస్ట్ సంచలనమైంది. మరి ఇప్పటికైనా మోడీ నోరు విప్పుతారో..? దేశంలో ఇంత రచ్చ జరుగుతున్నా పట్టించుకోకుండా విదేశీ పర్యటనలకో వెళ్లిపోతారో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -