Friday, April 26, 2024
- Advertisement -

కరోనా కల్లోలం.. మూడో సారి లాక్‌డౌన్.. !

- Advertisement -

గతేడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టేసింది. అయితే, గ‌త కొంత కాలంగా దాని ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపించింది. కానీ చాప‌కింద నీరులా వ్యాపిస్తూ.. మ‌ళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో కరోనా టీకా పంపిణీ కొనసాగుతోంది. అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం కట్టడి కావడంలేదు. వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.

మరీ ముఖ్యంగా టీకా తీసుకున్న వారు మ‌ళ్లీ వైర‌ప్ బారిన ‌ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు మరింతగా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌ తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది. దీంతో అప్రమత్తమైన ఫ్రాన్స్ మూడో సారి లాక్ డౌన్ విధించడానికి సిద్ధమైంది.

లాక్ డౌన్ కు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు అమ్మాన్యూయేల్ మేక్రాన్ ‘మూడో సారి లాక్ డౌన్ విధించడం తప్పడం లేదని’ ప్రకటించారు. ఇక భారత్ లోనూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 459 మంది మరణించగా.. 72,330 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, ఇండియా, ఫ్రాన్స్, రష్యాలు టాప్-5లో ఉన్నాయి. కొత్త మరణాలు, పాజిటివ్ కేసులు ఈ దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి.

అద‌ర‌గొడుతూ.. దూసుకుపోతున్న అందాల నిధి

ఏంటీ ఈ కోతలు.. కేంద్రంపై ఎర్ర‌బెల్లి ఫైర్ !

ఏప్రిల్‏లో సినీ ప్రియులకు పండగే.. !

కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -