Friday, May 17, 2024
- Advertisement -

ఈ స్థాయిలో ప్రజాస్పందన బాబుకు ఏనాడైనా దక్కిందా?

- Advertisement -

నలభై ఏళ్ళ రాజకీయ జీవితం……ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కువ కాలం ఉన్న రికార్డులు అన్నీ ఆయన సొంతం….అయితే ఏం లాభం? ఆయన రాజకీయ జీవితం గురించి గొప్పగా చెప్పుకునేవారు, ఆయనను నిజాయితీగా అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రజల గుండెళ్ళో ఏనాడైనా స్థానం సంపాదించుకోగలిగాడా? సినిమా సూపర్ స్టార్స్‌కి మించిన ప్రజాస్పందన ఒక రాజకీయ నాయకుడికి దక్కడం అంటే మామూలు విషయమా? ఇందిరాగాంధీ, నరేంద్రమోడీల స్థాయిలో జగన్‌కి ప్రజాదరణ ఎందుకు దక్కుతోంది? 40ఏళ్ళ రాజకీయ జీవితం తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకు ఆ స్థాయిలో ప్రజాదరణ దక్కడం లేదు.

ఎన్నికల్లో గెలుపోటములన్నివి ప్రజాభిమానంతో సంబంధం లేకుండా మేనేజ్‌మెంట్ తెలివితేటలు, ఎన్నికల హామీలు, ప్రచార స్టంట్స్, పొత్తుల వ్యవహారాలతో ముడిపడి ఉన్నవి అన్న విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అయితే ప్రజాదరణను గెలుచుకోవడం మాత్రం ఎన్నికల్లో గెలవడం కంటే కూడా ఎక్కువ కష్టం. అయితే చంద్రబాబుకు మాత్రం ఎప్పుడూ ఎన్నికల్లో గెలవడం, అధికారం దక్కించుకోవడంపైనే ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్న బిజినెస్ సామ్రాట్టులు, మీడియా వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజల అభిమానం పొందడం ఎలా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. అధికారం దక్కించుకోవడం ఎలా అన్నదే పాయింట్. 2014లో మోడీకి ఆదరణ ఉంది…….పొత్తు అన్నారు. ఇప్పుడు మోడీకి ప్రజావ్యతిరేకత పెరిగింది…..ఛీ…పో అంటున్నారు……అదీ పచ్చ బ్యాచ్ నైజం. నాలుగు ఓట్లు కలిసొస్తాయంటే ఏ అబద్ధమైనా చెప్తారు……ఎవ్వరితోనైనా కలుస్తారు. పరిటాల రవిని హత్యచేశారు అని చెప్పి దేశం మొత్తం నానాయాగీ చేసి……..ఆ హత్యలో ప్రధాన నిందితుడు జేసీ దివాకరరెడ్డి అని చెప్పి 2014 ఎన్నికల్లో గెలుపుకు జేసీ ఉపయోగపడతాడు అనుకున్నవెంటనే జేసీని పార్టీలో చేర్చుకుని సీట్లు ఇచ్చినట్టుగా ఉంటుంది పచ్చ బ్యాచ్ వ్యవహారం. తన భర్తను జేసీనే చంపేశాడు అన్న పరిటాల సునీత ఇప్పుడు అదే జేసీలో ఉన్న పార్టీలో ఎలా ఉందో…..పరిటాలను హత్య చేశారు అని గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు అదే జేసీ పక్కన ఎలా కూర్చుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఎన్టీఆర్ వెన్నుపోటుతోనే ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు. అయితే ప్రజలను పబ్లిసిటీతో మాయ చేయడం, ఎన్నికల సమయంలో పబ్లిసిటీ వ్యూహాలు, పొత్తుల వ్యవహారాలు, కుట్ర రాజకీయాలు, అబద్ధపు హామీలతో గెలవడం మాత్రం నేర్చుకున్నారు.

మరోవైపు వైఎస్‌ల చరిత్ర చూస్తే నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ ఈ రోజు జగన్ కానీ ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేయాలని మాత్రం ఎప్పుడూ చూడలేదు. 2014ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగతంగా కూడా జగన్‌ని ప్రత్యర్థులు ఏమైనా చేసే పరిస్థితులు……..ఆ విషయాలన్నీ కూడా జగన్‌కి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు పూసగుచ్చినట్టు చెప్పారు. రైతు రుణమాఫీ అన్న హామీ ఇవ్వమని చెప్పారు. అయితే జగన్ మాత్రం ఐదేళ్ళ అధికారం కోసం ప్రజలను మోసం చేస్తూ అడ్డమైన అబద్ధపు హామీలు ఇవ్వలేను అని చెప్పాడు. ప్రజాదరణతో ముఖ్యమంత్రి అవ్వాలి……..ఐదేళ్ళ తర్వాత చేసిన మంచిపనులతో మళ్ళీ మళ్ళీ ప్రజాదరణ దక్కించుకోవాలి అన్న ఆలోచన రాజశేఖరరెడ్డి, జగన్‌లది. అందుకే ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా……సినిమా స్టార్స్ కాకపోయినప్పటికీ…….ఎక్కడికి వెళ్ళినా తెలుగునాట ఉన్న వేరే ఏ ఒక్క నేతకూ లేనంత ప్రజాదరణ, ప్రజాభిమానం వాళ్ళకు దక్కుతోంది. కంటికి కనిపిస్తున్న ఈ నిజాన్ని ఎవరైనా కాదనగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -