ఇండియన్ టెలికం రంగంలో జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే జియో రావడంతో ఇతర కంపెనీలు కూడా పోటీగా ఆఫర్స్ ఇస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ తమ 4జీ యూజర్లకు ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తుంటే జియోకే చెమటలు పట్టించేలా ఉంది.
వోడాఫోన్ తమ 4జీ యూజర్లకు ఇంటర్నేషనల్ రోమింగ్ ఫ్రీ అని, విదేశాలకు వెళ్లిన వొడాఫోన్ యూజర్లు అన్‌లిమిటెడ్ హైస్పీడ్ 4జీ నెట్‌వర్క్ వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతానికి 40 దేశాలకు మాత్రమే పరిమితం. మరో షాకింగ్ ఆఫర్ ఏంటంటే వోడాఫోన్ యూజర్లకు గంటకు రూ.7 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
అయితే ఈ కాల్స్ వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య మాత్రమే. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎస్ఎల్ కూడా మరో ఆఫర్ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ గతంలో లాంచ్ చేసిన కొన్నిప్రమోషనల్ ఆఫర్లకు తాలుకా వ్యాలిడిటీ పిరియడ్‌ను మరో 90 రోజుల పాటు పొడిగించింది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.26 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా 26 గంటల పాటు తమ హోమ్ సర్కిల్ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.
Related