Tuesday, May 21, 2024
- Advertisement -

వెస్టిండీస్‌ మూడో టీ20లో నమోదైన రికార్డులు ఇవే..!

- Advertisement -

బుధవారం వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారించిన భారత బ్యాట్స్‌మన్‌ పలు రికార్డులను నమోదు చేయగా.. వెస్టిండీస్‌ జట్టు మాత్రం చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది.

  • స్వదేశంలో టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
  • టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మతో (2,633) సమంగా కోహ్లీ నిలిచాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకున్న రెండో క్రికెటర్‌గా కోహ్లీ (15) నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా అవార్డుతో మూడో స్థానంలో ఉన్న జాక్వస్‌ కలిస్‌ (14)ను కోహ్లీ దాటేశాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ (404) మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్‌ గేల్ (534), షాహిద్‌ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • ఒక టీ20 మ్యాచ్‌లో ముగ్గురు (రోహిత్ , రాహుల్, కోహ్లీ) ఆటగాళ్లు 70 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే తొలిసారి.
  • టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలు బాదడం ఇది ఐదోసారి.
  • టీ20ల్లో భారత్‌కు ఇదే మూడో అత్యుత్తమ స్కోరు. 2017లో శ్రీలంకపై చేసిన 260 పరుగులు అత్యధికం.
  • అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ చేతిలో వెస్టిండీస్‌ వరుసుగా ఏడు సిరీసులను కోల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -