Sunday, April 28, 2024
- Advertisement -

సూర్యను అడ్డుకోవాలంటే.. అదొక్కటే దారి!

- Advertisement -

ప్రస్తుతం టి20 క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ ఎవరైనా ఉన్నారా అంటే టీమిండియా యువ సంచలనం సూర్య కుమార్ యాదవ్ అనే చెప్పాలి. ప్రస్తుతం సూర్య ఉన్న భీకర ఫామ్ కి ప్రపంచ మేటి జట్లు హడలిపోతున్నాయి. సూర్య క్రీజ్ లోకి వస్తున్నడంటే ప్రత్యర్థి బౌలర్ కు చెమటలు పట్టాల్సిందే. బౌలర్ ఎవరైనా, జట్టు ఏదైనా, గ్రాండ్ ఎలా ఉన్న .. సూర్య బాదుడు మాత్రం ఒకేలా ఉంటుంది. గ్రౌండ్ కు అన్నివైపులా అలవోకగా షాట్స్ ఆడుతూ మొదటి బంతి నుంచే ఎదురుదాడి చేయడం సూర్య స్టైల్. దాంతో సూర్య ను నిలువరించే అస్త్రాలు లేక ప్రత్యర్థి జట్లు చేతులెత్తేస్తూ.. సూర్యకు సరండర్ అవుతున్నాయి. .

ఇక ఆరంగేట్రం చేసిన తక్కువ టైమ్ లోనే ఐసీసీ టి20 ర్యాంకింగ్ లో అగ్రస్థానంకి చేరుకున్నాడంటే స్కై కెపాసిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ లో కూడా తన మార్క్ చూపించిన సూర్య.. తాజాగా న్యూజిలాండ్ పై కూడా అదే భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా కివీస్ జట్ల మద్య నవంబర్ 20న జరిగిన రెండవ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఏకంగా సెంచరీతో చెలరేగి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ఎంతో మంది మాజీలతో పాటు కిసీస్ ఆటగాళ్లు కూడా సూర్యను ప్రశంశల్లో ముంచెత్తారు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. సూర్య ఆడిన షాట్స్ ను తనెప్పుడు చూడలేదని, అతడు అత్యుతమ ప్లేయర్ అంటూ కొనియాడాడు. సూర్యను నిలువరించడం కష్టమేనని, కివీస్ బౌలర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇక సూర్యను అడ్డుకోవాలంటే ఒక్కటే మార్గం అని అతడిని ” స్ట్రైకింగ్ లోకి రాకుండా ఆపడం ఒక్కటేనని వెటరన్ పెసర్ టిమ్ సౌథి చెప్పుకొచ్చాడు. మరి సూర్య భీకర ఫామ్ కు హడలిపోతున్న కివీస్ జట్టు నవంబర్ 22న జరిగే మూడవ టి20 మ్యాచ్ లో ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -