Saturday, April 20, 2024
- Advertisement -

అందుకే నువ్వు గ్రేట్ ర‌హానే.. హ్యాట్సాఫ్‌!

- Advertisement -

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత‌భావం ఎప్ప‌టికైనా మంచి ఫ‌లితాలు ఇస్తాయి అంటారు. టీమిండియా ఆట‌గాడు అజింక్య ర‌హానేకు ఈ మాట‌లు స‌రిగ్గా స‌రిపోతాయి. కీల‌క‌మైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులో లేక‌పోయినా, కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టినందుకు ఆ ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేశాడు ర‌హానే. అంతేకాదు యువ ఆట‌గాళ్ల‌తోనే జ‌ట్టును ముందుకు న‌డిపించి కూల్ కెప్టెన్సీతో బార్డ‌ర్‌- గావ‌స్క‌ర్ ట్రోఫిని నిల‌బెట్ట‌గ‌లిగాడు.

దీంతో అత‌డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. స్వ‌దేశానికి రాగానే ఘ‌న‌మైన స్వాగ‌తం ల‌భించింది. ఇలాంటి స‌మ‌యంలో ర‌హానే ప్ర‌వ‌ర్తించిన విధానం మ‌రోసారి అత‌డి వ్య‌క్తిత్వాన్ని గొప్ప‌గా నిలిపింది. ఒక‌చోట‌.. కంగారూ ఆకారంలో ఉన్న కేక్ క‌ట్ చేయడానికి నిరాక‌రించిన తీరు అత‌డి హుందాత‌నాన్ని చాటింది.

ఈ విష‌యం గురించి ర‌హానే మాట్లాడుతూ.. ‘కంగారూ ఆస్ట్రేలియా జాతీయ జంతువు.. ఏ దేశం అయినా సరే వారి గౌరవాన్ని కించపరచడం స‌రైన ప‌నికాదు. గెలిచామా.. చరిత్ర సృష్టించామా అన్నది ముఖ్యం కానే కాదు.. ప్రత్యర్థి జ‌ట్టును, వారి దేశాన్ని ఎంత గౌరవించామా అనేది ముఖ్యం. అందుకే ఆ కేక్‌ను కట్‌ చేయలేదు అని చెప్పాడు. దీంతో అత‌డిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నువ్వు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.

అద్భుతమైన క్యాచ్‌, వహ్వా అనాల్సిందే!

కోహ్లి నువ్వు సూప‌ర్‌.. నీకు తిరుగులేదు!

బాబోయ్‌.. అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

ఎమ్మెల్యే రోజాకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -