Tuesday, May 7, 2024
- Advertisement -

ఫ్యాన్స్‌కి షాక్‌.. కమెడియన్‌తో సాయి పల్లవి రొమాన్స్‌!

- Advertisement -

కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా, తన డాన్స్‌, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎన్నుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల ‘పావ కథైగల్’ అనే వెబ్ సినిమాలో నిండు గర్భిణిగా నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుత ఈ నాచురల్‌ బ్యూటీ నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’,రానాతో ‘విరాటపర్వం’సినిమాల్లో నటిస్తుంది. అలాగే పవన్‌ కల్యాణ్‌తో ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లోనూ న‌టించ‌బోతోంది.ఇంత బిజీగా ఉన్న ఈ నాచురల్‌ బ్యూటీ.. త్వరలో ఓ ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ హాస్యనటుడు కాళి వెంకట్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్ర దర్శకనిర్మాతలు హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట. సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒకవేళ సాయిపల్లవి ఒప్పుకుంటే గనక కొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఉంటూ కమెడియన్‌ పక్కన నటించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటివరకు సూర్య, ధనుష్, నాని లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో కలిసి రొమాన్స్‌ చేయడానికి ముందుకు వస్తుందో రాదో చూడాలి మరి.

3 నిమిషాల పాట కోసం రూ. 20 లక్షలు డిమాండ్

ఆన్లైన్ వ్యాపార పాఠాలు నేర్పుతున్న 21 సంవత్సరాల యువతి!

ఈ ఏడాది మెగా హీరోల సినిమాలు ఎన్ని విడుదల అవుతాయంటే?

మొసలితో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -