Thursday, May 2, 2024
- Advertisement -

అద్భుతమైన క్యాచ్‌, వహ్వా అనాల్సిందే!

- Advertisement -

బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్ స్టైకర్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. సమష్టి ప్రదర్శన చేసిన బ్రిస్బేన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్ అద్భుతమైన క్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికుల మదిని దోచేదిగా ఉంది.

ఆఫ్‌స్టంప్‌కు ఆవల లబుషేన్‌ ఫుల్‌టాస్‌ వేయగా.. అడిలైడ్‌ బ్యాట్స్‌మన్‌ మైకేల్‌ నెసర్‌.. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా.. లాంగ్‌ ఆన్ మధ్యలో నుంచి భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌మ్యాన్‌లా లాఫ్లిన్‌‌ క్యాచ్‌ అందుకున్నాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సీఎం ఇంట మంచు విష్ణు దంపతులు

బరాబర్‌ కేసీఆర్‌ కాళ్లు మొక్కుతా!

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -