Thursday, May 16, 2024
- Advertisement -

జింబాంబ్వేపై సీరిస్ విజయం

- Advertisement -

ఆ జట్టు క్రికెట్ ప్రపంచంలోని వచ్చి ఎన్నాళ్లో అయినా వాళ్లు ఇంకా కూనలే. దీనికి కారణం భారతదేశంలో క్రికెట్ క్రీడకున్న క్రేజ్ వాళ్లకు లేదు. అంతే కాదు.. ఇక్కడ ఈ క్రీడకు వచ్చే డబ్బు కాని, ఆటగాళ‌్ల పారితోషికం కాని.. ఇతర సదుపాయాలు కాని వాళ్లకు లేవు. అయినా వాళ్లు ఆడుతూనే ఉన్నారు. ఓడిపోతూనే ఉన్నారు. ఆ జట్టే జింబాంబ్వే. ప్రస్తుతం ఆ దేశ జట్టుతో భారత జట్టు కొన్ని మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లింది. ఇప్పటికే రెండు వన్డేలు కూడా జరిగాయి.  ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ అలవోకగా గెలిచింది.

మూడు మ్యాచ్ ల వన్డే సీరిస్ ను ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే గెలుచుకుంది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ చేసిన ఓ మంచి పని ఉంది. అదే కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం. ఒక విధంగా ఇది మంచి నిర్ణయమే. కుర్రాళ్లు ఇతర దేశాలతో ఎలా ఆడుతున్నారో అంచనా వేసేందుకు అవకాశం వస్తుంది.   జింబాంబ్వే జట్టుకు అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ కూడా భారత యువ ఆటగాళ్లు చిత్తు చేస్తున్నారు. శనివారం జరిగిన తొలి వన్డే,, సోమవారం జరిగిన రెండో వన్డే కూడా ఏకపక్షంగా జరిగాయి.

ఈ రెంటిలోనూ భారత తరఫున బౌలింగ్ చేసిన వాళ్లు కాని, బ్యాటింగ్ చేసిన వాళ్లు కాని అనుభవజ్ఞులైన వారు కాదు. ఒక్క అంబటి రాయుడు తప్ప మిగిలిన వారంతా అంతర్జాతీయ పోటీలకు దాదాపు కొత్తవారే. వీళ్ల చేతిలో కూడా జింబాంబ్వే జట్టు దారుణంగా ఓడిపోతోందంటే అక్కడ వారికి క్రికెట్ లో ఇస్తున్న శిక్షణ, ఇతర సదుపాయాల గురించి క్రికెట్ లోకం పట్టించుకోవాలి. జట్లు ఇలా ఉండాలి… ఇలా చేయాలి అంటూ గీతలు గీసే ఐసిసి చిన్న జట్లు క్రికెట్ నిలబడేందుకు అవసరమైన సాయం చేయాలి. అప్పుడే అన్ని దేశాలు ఈ క్రీడలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -