Saturday, May 18, 2024
- Advertisement -

ఎంపీ అరవింద్‌కు ప్రశాంత్‌రెడ్డి సవాల్‌

- Advertisement -

అరవింద్ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. ఆసరా పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం రెండువందలకు మించి ఒక్కరూపాయి ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజినామా చేస్తానని అన్నారు. లేదంటే అరవింద్ ఎంపీ పదవికి రాజినామా చేస్తారా అని ప్రశాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచాచాలు బంద్‌ చెయ్యాలని మంత్రి హితవు పలికారు.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రూ.9 కోట్ల విలువైన రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పల్లెలు ప్రగతి పథం లో ముందుకెళ్తున్నాయని మంత్రి వివరించారు. గృహనిర్మాణాలకోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4 లక్షల 32 వేలు ఇస్తుంటే, కేంద్రం ఇచ్చేది కేవలం 72 వేలు మాత్రమేనని వివరించారు. బీజేపీ నేతలు అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని ఆయన కోరారు.

తండ్రి వయసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకులు సంస్కారం హీనంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, ఎంపీ అరవింద్‌ పరిధి దాటి మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేముంటే.. పౌరుషం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. కన్న కొడుకులాగా చూసుకుంటాడు కాబట్టే తండ్రి సమానమైన కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతానని మంత్రి వ్యాఖ్యానించారు.

ఆ ప్రాంతాల‌న్నీ హైసెన్సిటివ్

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -