Tuesday, May 21, 2024
- Advertisement -

కామన్వెల్త్‌లో డబుల్ ట్రాప్ షూటర్ శ్రేయాసి సింగ్‌కి స్వర్ణం

- Advertisement -

ఆస్ట్రేలియాలో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారత్‌కి బుధవారం మరో పసిడి పతకం దక్కింది. మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్‌లో పోటీపడిన శ్రేయాసి సింగ్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం గెలుపొందింది. ఫైనల్లో శ్రేయాసి సింగ్ పోటీపడిన నాలుగు రౌండ్లలో వరుసగా 24, 25, 22, 25 స్కోర్ సాధించి.. 96+2తో అగ్రస్థానంలో నిలవగా.. ద్వితీయ స్థానంలో ఆస్ట్రేలియా షూటర్ ఎమ్మా కాక్స్‌ 23, 28, 27, 18 = 96+1తో నిలిచింది.

శ్రేయాసి సాధించిన స్వర్ణంతో భారత ఖాతాలో 12 బంగారు పతకాలు చేరగా, మొత్తం 23 పతకాలు సాధించిన ఇండియా మెడల్స్ పట్టికలో ఆస్ట్రేలియా, బ్రిటన్ తరువాత మూడో స్థానంలో కొనసాగుతోంది. 12 గోల్డ్ మెడల్స్ తో పాటు 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ ను భారత ఆటగాళ్లు సాధించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 స్వర్ణాలు, 39 రజతాలు, 42 కాంస్యాలతో మొత్తం 133 పతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా, 24 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -